Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆలస్య ప్రసవాలు....సమస్యలు లేని బిడ్డలు!

ఈ దిశగా చేసిన స్టడీ చాలా విస్తృతంగా చేయబడింది.ఈ వార్తను చాలామంది ప్రజారోగ్య సంస్ధలు, వైద్య సిబ్బందులు ప్రచారం చేశారు. మహిళలో కాన్పులు త్వరగా అవాలని కోరుకోవటం సరికాదని, గర్భవతులు 37 నుండి 41 వారాలలోపు ప్రసవిస్తూంటారని, అది శారీరక ధర్మం అని మార్చ్ ఆఫ్ డైమ్స్ మెడికల్ డైరెక్టర్ అలన్ ఫ్లీష్ మన్ తెలిపారు. వైద్య పరంగా ఎంతో అవసరముంటే కాని ఈ శారీరక ధర్మంలో జోక్యం చేసుకోరాదని కూడా వారు తెలిపారు.
37 నుండి 40 వారాల గర్భంతో ప్రసవించిన బేబీల మరణాలను వారు విశ్లేషించారు. 40 వారాల సమయం పూర్తి గర్భదశ కాలమని, కాని చాలామంది 37 నుండి 38 వారాలుగా లేదా అంతకు తక్కువగా వుండాలని భావిస్తారని 37 వారాలలోపు పుట్టిన బిడ్డలను ముందస్తుగా పుట్టిన వారిగా పరిగణించాలన్నారు.
అయితే 37 వారాలకు పుట్టిన బిడ్డలకు 40 వారాలకు పుట్టిన బిడ్డలతో పోలిస్తే రిస్కు అధికంగా వుందన్నారు. 37 వారాల వారిలో ప్రతి వేయి మంది బేబీలకు 3.9 శాతం మరణాలుండగా 40 వారాలకు పుట్టిన వారిలో ప్రతి వేయి మంది జననానికి 1.9 మరణ శాతమేనని తెలిపారు. అయితే, వైద్య అవసరాల కారణంగా అతి త్వరగా అంటే 39 వారాలకే ప్రసవం చేయవచ్చని, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్ స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ సంస్ధ తెలుపుతోంది.
37 వారాలకే పుట్టిన పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని వారికి వెంటిలేషన్ ఏర్పరచాల్సిన అవసరం వుంటోందని తెలిపారు. అంతేకాక వీరిలో కామెర్లవంటివి, లేదా బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలియపరచారు. కొన్ని సార్లు తల్లి త్వరిత కాన్పు కోరగా మరికొన్ని కేసులలో వైద్యులు త్వరిత కాన్పులను సూచిస్తున్నారని ఇది సరికాదని, బేబీకి పూర్తిగా 40 వారాలపాటు గర్భంలో వుండే సౌకర్యం వుంటుందని, ఈ శారీరక ధర్మం పాటిస్తే, పుట్టబోయే బిడ్డలకు సమస్యలుండవని రీసెర్చర్లు తెలిపారు.



Click it and Unblock the Notifications