Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కడుపు నిండా తిన్న వెంటనే మళ్లీ ఆకలా? ఆ తీవ్రమైన వ్యాధులకు సంకేతమే!
సాధారణంగా మనం కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కనీసం నాలుగైదు గంటల పాటు ఆహారం వైపు కన్నెత్తి కూడా చూడం. శరీరానికి అవసరమైన శక్తి లభించడంతో మెదడుకు ఇక చాలు అనే సంకేతం అందుతుంది. కానీ కొంతమందికి మాత్రం ప్లేట్ ఖాళీ చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లు అనిపిస్తుంది.

మీరు కూడా ఈ సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నారా? అయితే దయచేసి దీనిని తేలికగా తీసుకోకండి. వైద్య పరిభాషలో ఇలా విపరీతమైన ఆకలి వేయడాన్ని పాలిఫేజియా అంటారు. ఇది కేవలం భోజన ప్రియత్వానికి సంకేతం మాత్రమే కాదు, మన శరీరంలో పొంచి ఉన్న తీవ్రమైన అనారోగ్య సమస్యలకు మొట్టమొదటి హెచ్చరిక కూడా కావచ్చు.
మధుమేహం, థైరాయిడ్
విపరీతమైన ఆకలి వెనుక దాగి ఉన్న అతి పెద్ద విలన్లలో ఒకటి డయాబెటిస్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేనప్పుడు లేదా శరీరం దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోలేనప్పుడు, మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ (చక్కెర) కణాలకు చేరదు. దీనివల్ల కణాలకు శక్తి అందక, మెదడుకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఫలితంగా ఎంత తిన్నా ఇంకా ఆకలిగానే అనిపిస్తుంది.
అలాగే హైపర్‌థైరాయిడిజం కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు. థైరాయిడ్ గ్రంథి పరిమితికి మించి చురుకుగా పనిచేసినప్పుడు శరీర జీవక్రియల రేటు అమాంతం పెరిగిపోతుంది. క్యాలరీలు చాలా వేగంగా కరిగిపోతాయి. తద్వారా పదే పదే తినాలనే కోరిక పుడుతుంది. ఆకలితో పాటు ఆకారణంగా బరువు తగ్గిపోతుంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
హార్మోన్ల దోబూచులాట..చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు
మన శరీరంలో ఆకలిని, కడుపు నిండిన భావనను నియంత్రించేవి లెప్టిన్, గ్రెలిన్ అనే హార్మోన్లు. గ్రెలిన్ ఆకలిని పుట్టిస్తే, లెప్టిన్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఈ రెండు హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, మనం ఎంత తిన్నా మెదడుకు తృప్తి చెందిన భావన కలగదు. అందుకే కొంతమంది రోజంతా తింటూనే ఉంటారు.
మరోవైపు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు శరీరానికి తక్షణమే శక్తి అవసరం అవుతుంది. ఆ సమయంలో విపరీతమైన ఆకలి పుట్టి, వెంటనే ఏదైనా తినేయాలనిపిస్తుంది.

మానసిక ఒత్తిడి, కుంగుబాటు కూడా కారణమే
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ సర్వసాధారణంగా మారాయి. తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ భారీగా పెరుగుతుంది. ఇది నేరుగా మన ఆకలిని ప్రేరేపించి, ఎమోషనల్ ఈటింగ్ కు దారి తీస్తుంది. కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల కూడా ఆకలి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
డాక్టర్ ని ఎప్పుడు కలవాలి?
పదే పదే ఆకలి వేయడంతో పాటు ఎప్పుడూ అలసటగా ఉండటం, విపరీతమైన నీరసం, తల తిరగడం, కారణం లేకుండా అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్ వెళ్లి సరైన పరీక్షలు చేయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
