Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
మిమ్మల్ని పేదరికంలోకి నెట్టే ఆర్థిక అలవాట్లు..చాణక్యుడి ప్రకారం ఆ 5 విషయాలపై ఖర్చు పెడితే అస్సామే!
ప్రాచీన భారతదేశపు మహా పండితుడు, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా ప్రపంచానికి అద్భుతమైన జీవన సూత్రాలను అందించాడు. జీవితంలో ఒక స్థాయికి చేరుకోవాలంటే కేవలం కష్టపడితే సరిపోదు, ఆ కష్టానికి తగిన వివేకం కూడా తోడవాలని చాణక్యుడు ఎప్పుడో చెప్పారు.

ఈ రోజుల్లో లామంది మంచి జీతాలు తీసుకుంటున్నప్పటికీ, నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణం సంపాదన లేకపోవడం కాదు, ఆర్థిక క్రమశిక్షణ లోపించడమే. ఒక వ్యక్తి ఆర్థిక విజయం అతడు ఎంత సంపాదిస్తున్నాడు అనే దానిపై కాకుండా, ఎంత పొదుపు చేస్తున్నాడు, ఎంత తెలివిగా ఖర్చు పెడుతున్నాడు అనేదానిపై ఆధారపడి ఉంటుందని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది. మిమ్మల్ని పేదరికంలోకి నెట్టే ఆ ప్రమాదకరమైన ఆర్థిక అలవాట్లు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ చూడండి.
ఇతరుల మెప్పు కోసం ఆడంబరాలకు పోకండి
నేటి సమాజంలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. పక్కవారిని మెప్పించడం కోసం లేదా సమాజంలో గొప్పగా కనిపించడం కోసం తమ స్తోమతకు మించి ఖర్చు చేయడం. ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, బ్రాండెడ్ బట్టలు కొనడం, అవసరం లేకపోయినా ఇతరుల ముందు స్టేటస్ చూపించుకోవడానికి విలాసవంతమైన విందులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇతరులను ఆకర్షించడం కోసం చేసే ఖర్చులు మీ ఆర్థిక పునాదిని నాశనం చేస్తాయి. తాత్కాలికమైన సామాజిక హోదా కోసం ఆరాటపడటం కంటే, జీవితానికి సరిపడా దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను ఏర్పాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణమని చాణక్యుడు సూచిస్తున్నాడు.
చిన్న చిన్న ఖర్చులే కదా అని నిర్లక్ష్యం చేయవద్దు
సాధారణంగా మనం పెద్ద ఖర్చుల గురించి బాగా ఆలోచిస్తాం కానీ రోజువారీగా చేసే చిన్న చిన్న ఖర్చులను పెద్దగా పట్టించుకోము. 'ఇది కేవలం పది రూపాయలే కదా, వంద రూపాయలే కదా' అనుకుంటూ చేసే ఈ చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో కొండంతగా మారి మీ పొదుపును హరించివేస్తాయి. నీటి బిందువులు ఎలాగైతే కుండను నింపుతాయో, అలాగే రోజువారీ అనవసర ఖర్చులు మీ బ్యాంకు బ్యాలెన్స్ ను ఖాళీ చేస్తాయి. అందుకే ప్రతిరోజూ మనం చేసే ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను ఎప్పటికప్పుడు లెక్కించుకోవడం ద్వారా డబ్బు వృధా కాకుండా అరికట్టవచ్చు.

సంపాదించిన ప్రతి రూపాయిని ఖర్చు చేయకండి
జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి వివేకవంతులైన వారు తన సంపాదనలో కొంత భాగాన్ని కచ్చితంగా భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెడతారు. అనారోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. అలాంటి సమయాల్లో మనల్ని ఆదుకునేది మనం చేసుకున్న పొదుపు మాత్రమే. ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఆదా చేసే అలవాటును పెంపొందించుకుంటే, కష్టకాలంలో ఇతరుల ముందు చెయ్యి చాపాల్సిన అవసరం రాదు.
విలాసాల కోసం అప్పులు చేయకండి
అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా, కేవలం మన జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి, ఇంటికి అనవసరమైన విలాస వస్తువులు కొనుగోలు చేయడానికి లోన్లు, ఈఎంఐలు చేయడం చాలా ప్రమాదకరం. ఇలాంటి అప్పులు క్రమంగా పెరిగిపోయి జీవితాంతం తీర్చలేని భారంగా మారుతాయి. మన ఆదాయానికి తగ్గట్టుగానే మన ఖర్చులు ఉండాలి. పరిమితుల్లో జీవించడం నేర్చుకోవాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించి, అవసరం లేని అప్పులకు దూరంగా ఉంటే జీవితంలో మనశ్శాంతితో పాటు అద్భుతమైన ఆర్థిక స్వేచ్ఛ మీ సొంతం అవుతుందని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
సరైన మార్గంలో పెట్టుబడి పెట్టండి
డబ్బును కేవలం సంపాదించి, దాచుకుంటే సరిపోదు.. దానిని సరైన చోట పెట్టుబడిగా పెట్టాలి. మీ దగ్గర ఉన్న అదనపు డబ్బును క్షణికానందాల కోసం ఖర్చు చేసే బదులు, దాన్ని మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఉన్నత విద్య కోసం, పొదుపు పథకాలలో లేదా భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టే మంచి ఆస్తుల కొనుగోలు కోసం ఉపయోగించండి. సంపదను సరైన ప్రణాళికతో నిర్వహించినప్పుడే అది రెట్టింపు అవుతుంది.



Click it and Unblock the Notifications