Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
అతి ఆలోచనలతో జుట్టు ఊడిపోతుందా?.. ఈ యోగా ముద్రలతో చెక్ పెట్టేయండి.!
పొడవైన, ఒత్తయిన కురులు అతివల హక్కు. కానీ టీనేజ్ వయసు దాటి ఓ స్టేజ్‌కి వచ్చాక ఒత్తిడి, పొల్యూషన్, అతిగా ఆలోచించడం ఇలా పలు కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. ఈ కాలంలో ఈ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ సమస్యకి యోగాతో పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.

యోగా ఇప్పుడు చాలా మంది జీవితాల్లో అంతర్భాగం అయింది. ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రశాంతత కోసం యోగాను అలవాటు చేసుకుంటున్నారు. ప్రజల్లో పెరిగిన అవగాహన ఇందుకు కారణం. అందుకే ప్రతి యేటా ప్రత్యేకంగా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. శరీర బాహ్య సౌందర్యం నుంచి అంతర్గత ఆరోగ్యం వరకు యోగా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ యోగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాల ప్రయోజనాలు తెలుసుకుందాం..
మన పూర్వీకుల కాలంలో మహిళలకు ఒత్తయిన, నల్లటి కురులు ఉండేవి. కానీ ఈ కాలంలో క్రమేపీ ఆ సంఖ్య తగ్గిపోతుంది. ఇందుకు ముఖ్య కారణం జీవనశైలి, పని ఒత్తిడి, అతి ఆలోచనలు కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మన శరీరంలో ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంది. అదే యోగా. యోగాసనాల ద్వారా బాడీలో ప్రతి నరం ఉత్తేజితమై సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో దోహదపడుతుంది. ఈ క్రమంలో అతి ఆలోచనలు, జుట్టు రాలిపోవడం సమస్యలను నివారించే పలు యోగ ముద్రలు ఇక్కడ చూద్దాం.
పృథ్వి ముద్ర
జుట్టు ఆరోగ్యానికి తల చర్మంపై రక్త ప్రసరణ చాలా ముఖ్యం. అప్పుడే కురులు దృఢంగా పెరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే జుట్టు బలహీనంగా తయారవుతుంది. ఇందుకోసం పృథ్వి ముద్ర యోగాసనం దోహదపడుతుంది.
ప్రాణ ముద్ర
ప్రాణ ముద్ర యోగాసనం ద్వారా జుట్టు మొదళ్లు బలంగా తయారవుతాయి. దీనివల్ల జుట్టు తెగడం, ఊడిపోవడం బారి నుంచి కాపాడుకోవచ్చు.
జ్ఞాన ముద్ర
ఒత్తిడితో జుట్టు రాలడం సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ జ్ఞాన ముద్ర ద్వారా ఉపశమనం పొందవచ్చు. హెయిర్ ఫాల్‌కి సంబంధించి ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది.
వాయు ముద్ర
తలపై చుండ్రు, దురద కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ యోగ ముద్ర ద్వారా చుండ్రు, దురద సమస్యలను నివారించవచ్చు.
బాలాయం ముద్ర
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బలంగా ఉండటం ముఖ్యం. లేదంటే వాతావరణ పరిస్థితులను తట్టుకోలేవు. ఫలితంగా కురులు రాలిపోవడం, పల్చబడటం జరుగుతుంటాయి. బలమైన, ఒత్తయిన కురుల కోసం బాలాయం ముద్రను ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజూ రాత్రి పడుకునే సమయం లేదా తెల్లవారుజామున ప్రశాంతమైన వాతావరణంలో ఈ యోగ ముద్రలను పాటించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. ఒత్తిడి తొలగి అంతరాయం లేని నిద్రను ఆస్వాదించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
