Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
భాగస్వామితో బలమైన బంధానికి 7-7-7 ఫార్ములా.. ఇప్పుడు ఈ ట్రెండ్‌దే హవా.!
రిలేషన్స్‌కి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ట్రెండింగ్‌లో ఉంటుంది. కొంతకాలంగా 7-7-7 రూల్ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు లేదా ప్రేమికులు జంట ఏదైనా 7-7-7 రూల్‌ను తప్పనిసరిగా ట్రై చేయాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సలహా ఇస్తున్నారు. దీంతో బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అసలేంటి ఈ రూల్.. ఇక్కడ తెలుసుకుందాం..

ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు లేదా ప్రేమికులకు సరైన ప్రైవసీ దొరకడం లేదు. ఏకాంతంగా మాట్లాడుకోవడానికి సైతం వీలుపడటం లేదు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఇంటి బాధ్యతలతో బిజిబిజీగా గడపడుతూ భాగస్వామికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా లవర్స్ బ్రేకప్ చెప్పుకోవడం, దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి విడిపోయే పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అందుకే 3-6-9 రూల్, 3-3-3 రూల్ ఇలా కొన్ని నియమాలతో సంబంధాలు బలపడేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా 7-7-7 రూల్‌ను పాటిస్తున్నారు.
దంపతులు లేదా లవర్స్ ఒకరికొకరు కబుర్లు, అభిప్రాయాలు పంచుకోవడానికి సమయం కేటాయించుకోవడం అవసరం. వారి మధ్య బంధం మరింతగా బలపడాలి. అందుకోసమే 7-7-7 ఫార్ములా. ఇందులో మూడు ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి.
ప్రతి 7- రోజులకి ఒక డేట్
ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నా వారానికి ఒకసారి ఖచ్చితంగా మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం అవసరం. కలిసి సినిమా చూడటం, లేదా రెస్టారెంట్, ప్రశాంత వాతావరణంలో స్నాక్స్ తింటూ మాట్లాడుకోవడం వంటివి చేయడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫోన్లు, వృత్తిపరమైన విషయాలను పక్కనబెట్టి ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరచాలి.
ప్రతి 7- వారాలకు వెకేషన్
ప్రతి ఏడు వారాలు లేదా రెండు నెలలకోసారి ఇంటి నుంచి దూరంగా కొత్త వాతావరణంలో గడిపేందుకు ప్లాన్ చేసుకోవాలి. రిసార్టులు లేదా మంచి హోటల్స్‌లో రూమ్ బుక్ చేసుకుని సరదాగా గడపాలి. రొటీన్ బాధ్యతలకు బ్రేక్ ఇచ్చి ప్లేస్ ఛేంజ్ అవ్వడం ద్వారా కొత్త సంతోషకర జ్ఞాపకాలను సంపాదించుకోవచ్చు.

ప్రతి 7 నెలలకు లాంగ్ టూర్
భాగస్వామితో కలిసి ప్రతి 7 నెలలకు ఒకసారి లాంగ్ టూర్ ప్లాన్ చేసుకోవాలి. కనీసం 3 రోజులైనా పార్ట్‌నర్‌తో కలిసి కొత్త ప్రదేశాలు తిరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆలయాలు, హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు ఇలా ఏదైనా ఆధ్యాత్మికత లేదా ఎంజాయ్ చేసే ప్రదేశాలకు ప్రాధాన్యత ఇచ్చి భాగస్వామితో కలిసి సంతోషకర క్షణాలను ఆస్వాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంతో కలిసి కాకుండా కేవలం దంపతులు మాత్రమే వెళ్లడం ద్వారా వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుంది.
మీ బడ్జెట్, సెలవులు, సమయం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతూ వారితో మళ్లీ మళ్లీ ప్రేమలో పడటం ద్వారా రిలేషన్ అనేది ఎప్పటికీ బోర్ కొట్టదు. చిన్న చిన్న గొడవలు తలెత్తినా ఇలాంటి తీపి జ్ఞాపకాలు మీ బంధాన్ని దృఢంగా, ఆదర్శంగా ఉంచుతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications
