Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
అలర్ట్: సిజేరియన్ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు !
బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆడవాళ్ల లైఫ్ లో మధురానుభూతి. అలాగే.. డెలివరీ విషయంలో ఆడవాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. డెలివరీ సమయంలో శరీరంలోని ఎముకలన్నింటినీ మెలేసినట్టు ఉండే ఆ నొప్పి భరించే గొప్ప సహనం కలిగి ఉంటారు మహిళలు.
బుజ్జాయిల గురించి తెలుసుకోవాల్సిన బుల్లి బుల్లి కబుర్లు
అయితే డెలివరీ రెండు రకాలుగా ఉంటుంది. నార్మల్ డెలివరీ, సిజెరియన్ డెలివరీ. బిడ్డకు జన్మనివ్వడానికి సహజ పద్ధతి అనుకూలించనప్పుడు సిజేరియన్ అంటే సర్జరీ ద్వారా డెలివరీ చేస్తారు. కానీ.. ప్రస్తుత రోజుల్లో డెలివరీ అంటే.. సిజేరియన్ కామన్ గా వినిపిస్తోంది. కాబట్టి సిజేరియన్ డెలివరీలు చేయించుకుంటున్న ఆడవాళ్లు చాలా అలర్ట్ గా ఉండాలి.
పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?
సర్జరీ ద్వారా జరిగే సిజేరియన్ వల్ల బేబీకి, తల్లికి ఇద్దరి హానిజరిగే అవకాశం ఉంది. అలాగే సిజేరియన్ తర్వాత తల్లి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి సిజేరియన్ చేయించుకున్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. సిజేరియన్ సమయంలో తల్లులు తమ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ? సిజేరియన్ తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు ? సిజేరియన్ డెలివరీ తర్వాత తల్లులు దూరంగా ఉండాల్సిన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

వ్యాయామం
సిజేరియన్ తర్వాత మహిళలు శారీరక వ్యాయామాలకు, ఇంటి పనులకు దూరంగా ఉండాలి. సిజేరియన్ కుట్లు బాధిస్తాయి కాబట్టి.. పనులకు దూరంగా ఉంటూ.. రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం.

బరువు ఎత్తకూడదు
సిజేరియన్ చేయించుకున్న మహిళలు.. ఎట్టిపరిస్థితుల్లో బరువులు ఎత్తకూడదు. కొన్ని వారాల పాటు ఏ మాత్రం బరువు ఉన్న వస్తువులు ఎత్తకూడదు. బరువు వస్తువులు ఎత్తడం వల్ల..బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

డీహైడ్రేషన్
సిజేరియన్ అయిన మహిళలకు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా కష్టం. అయితే.. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శక్తివంతంగా ఉండటంతో పాటు, కాన్స్టిపేషన్ నివారించవచ్చు. కాన్స్టిపేషన్ సమస్య వల్ల పొత్తకపుపై ఒత్తిడి పెరిగి.. నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

మెట్లకు దూరంగా
సిజేరియన్ డెలివరీ తర్వాత.. మెట్లు ఎక్కకపోవడం చాలా మంచిది. ఎక్కువగా మెట్లు ఎక్కడం వల్ల.. అలసటకు లోనవుతారు. అలాగే సర్జరీ గాయాలు తగ్గకుండా, రక్తస్రావానికి అవకాశం ఉంది.

లైంగిక చర్య
సిజేరియన్ తర్వాత కొన్ని వారాలపాటు.. సెక్సువల్ ఇంటర్ కోర్స్ కి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇంటర్ కోర్స్ లో పాల్గొనడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

దగ్గకూడదు
దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. కామన్ కోల్డ్, దగ్గు కి దూరంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. సిజేరియన్ తర్వాత ఎక్కువగా దగ్గడం వల్ల సర్జరీ చేసిన దగ్గర ఒత్తిడి పెరిగి.. గాయం మానడానికి సమయం పడుతుంది.

స్పైసీ ఫుడ్
సిజేరియన్ తర్వాత శుభ్రమైన, హెల్తీ ఫుడ్ తీసుకోవడం మంచిది. దీనివల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పైడీ, ఆయిలీ ఫుడ్ కి దూరంగా ఉండటం చాలా ముఖ్యమైనది.

లాంగ్ బాత్స్
సిజేరియన్ డెలివరీ తర్వాత కొన్ని రోజుల పాటు.. షవర్ బాత్ లకు దూరంగా ఉండటం మంచిది. ఎక్కువ సమయం స్నానం చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులపాటు.. తడి టవల్ తో శరీరాన్ని తుడుచుకోవడం వంటి అలవాట్లు మంచిది.

జ్వరం
సిజేరియన్ తర్వాత హెల్తీగా ఉండటం చాలా అవసరం. అది బిడ్డకు, తల్లికి ఇద్దరికీ శ్రేయస్కరం. ఫ్లూ, ఫీవర్ వంటివి రాకుండా జాగ్రత్త పడాలి. సర్జరీ చేసిన గాయం త్వరగా మానకపోయినా.. జ్వరం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. చాలా అలర్ట్ గా ఉండాలి.



Click it and Unblock the Notifications