Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణి మహిళల్లో నడుమునొప్పిని పోగొట్టడం ఎలా...!?

గర్భంలోని ఎదుగుతున్న బేబీ కారణంగా తల్లి ఆ బరువును మోయటానికి ముందుకు వంగాల్సి వస్తుంది. ఈ వంపు ఆమె వెన్నుకు కటి కండరానికి నొప్పి కలిగిస్తుంది. కటి నొప్పి అంటే నడుము కండరాలకు సంభవించే నొప్పి. ఇది గర్భవతికి సుమారుగా చివరి దశలలో అధికంగా వుంటుంది. బేబీ కటి ప్రదేశంలోకి పడటం వలన అక్కడి కండరాలు ఒత్తిడి భావిస్తాయి. పిండం యొక్క తల కూడా నడుము, మూత్రాశయం, పిరుదులపై ఒత్తిడి కలిగిస్తుంది. దాంతో తల్లిలో కడుపుతో పాటి ఇతర అవయవాలు కూడ ఉబ్బినట్లు కనబడుతాయి. దాంతో కడుపులో ఉన్న బిడ్డ బరువు, తల్లి బరువు శరీరంపై వత్తిడి పెరిగి బ్యాక్ పెయిన్ అధికమవుతుంది.
మరి బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించాలో చూద్దాం...
1. కూర్చొనే విధానం: కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు, బేబి కదలికలను బట్టి కండరాలు గట్టిపడుతూ లావెక్కుతారు. వేసుకొనే దుస్తులు కూడా బిగుతుగా ఉన్నట్లైతే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కూర్చొనే విధానంలో జాగ్రత్త వహించాలి. అప్పుడప్పుడు లేచి నడవడం, కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, కాళ్ళను చాచి కోర్చూవడం, మెల్లిగా వంగడం వంటివి చేస్తుంటే కొద్దిగా విశ్రాంతి కలుగుతుంది. ముఖ్యంగా పడుకొనేటప్పుడు నిటారుగా కాకుండా ప్రక్కకు తిరిగి పడుకొనేందుకు ప్రయత్నం చేయాలి.
2. మసాజ్: గోరు వెచ్చని నూనె, లూబ్రిక్యాట్స్ తో వెన్నుకు మసాజ్ చేయడం వల్ల కండరాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలు బెణుకులు ఏర్పడకుండా నిరోధిస్తుంది. డెలివరీ రోజులు దగ్గరపడుతున్నాయనంగా మీరు ఎక్కువగా నడవడం, లేదా ఎక్సర్ సైజ్ చేయడం వంటివి చేయకూడదు. వీటికి బదులుగా కండరాల విశ్రాంతి కోరకు ఆక్యూప్రెజర్ లేదా ఆక్యుపంక్చర్ వంటి వాటితో విశ్రాంతిని తీసుకోవచ్చు.
3. వ్యాయామం: గర్భిణిగా ఉన్నప్పుడు, మీరు చేసే వ్యాయామాలు సాధారణమైనవిగాను, చాలా సులభంగాను ఉండేట్లు చూసుకోవాలి. నడక - ఉదయంవేళ వికారం, అలసట మొదలైనవి రాకుండా మూడవ నెల గర్భవతి నడక వ్యాయామంగా ఎంచుకోవాలి. ఆమెకే కాక, కడుపు లోని బిడ్డకు కూడా ఇది మంచిది. రక్త ప్రసరణ అధికంచేసి ఫిట్ గా వుంచుతుంది. స్విమ్మింగ్ : గర్భవతులకు ఇది చాలా మంచి వ్యాయామం. దీనిని మూడవనెలలో మొదలు పెట్టి. గర్భవతి దశ చివరిదాకా చేయవచ్చు. స్విమ్మింగ్ చేసే ముందు కొద్దిగా అరబిక్ వ్యాయామం చేసి శరీరాన్ని వేడెక్కించండి. స్విమ్మింగ్ తర్వాత కూడా కండరాల నొప్పులు పోగొట్టేందుకు వామ్ అప్ చేయాలి. రక్తప్రసరణ మొనరించి, కండరాల పటుత్వం పెంచుతుంది.
4. డ్రెస్సింగ్ టిప్స్: గర్భాధారణ సమయంలో వస్త్రాధారణ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గర్భిణులు బిగుతయిన దుస్తులను ధరించకూడదు. సౌకర్యవంతమైన దుస్తులను ధరించడం వల్ల కండరాలు బలహీనపడకుండా, బ్యాక్ పెయిన్ రాకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. హైహీల్స్ పాదరక్షలను ఉపయోగించకూడదు.
5. ఇతర చిట్కాలు: బాగా నిద్రపోవాలి. నిద్రపోయే సమయంలో తలక్రిందుగా పిల్లోను వేసుకోవడం మంచిది. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పు తక్షణ ఉపశమనానికి వేడినీళ్ళ బ్యాగ్స్ నడుము క్రింద పెట్టుకోవాడం, ఐస్ ప్యాక్ పెట్టుకోవడంతో కొంత వరకూ రిలీఫ్ ఉంటుంది.



Click it and Unblock the Notifications