Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బరువు తక్కువగా పుట్టే పిల్లలకు కారణాలు... తీసుకోవల్సిన జాగ్రత్తలు

1. ముఖ్యంగా బాల్యంలోనే పెళ్ళి చేసుకోవడం వల్ల వచ్చే గర్భాధారణ.
2. గర్భిణీలో రక్తహీనత - ఆహార లోపం.
3. నెలలు నిండక ముందే కాన్పు కావడం.
4. గర్భానికి - గర్భానికి మధ్య దూరం పాటించకపోవడం.
5. గర్భాధారణ సమయంలో స్త్రీలు వ్యాధులకు గురికావడం.
6. ఎక్కువ సార్లు గర్భం ధరించడం.
7. వీటినంటికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, అమాయకత్వం, మూఢనమ్మకాలు.
పిల్లలు తక్కువ బరువుతో పుట్టకుండా సంపూర్ణ ఆరోగ్యం, బరువుతో పుట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు...
1. పిల్లలు కరెక్ట్ బరువుతో పుట్టాలంటే 20-30 సంవత్సరాల వయస్సులోపలే గర్భధారణకు అనువైన సమయం. వీలున్నంత వరకు ఆ వయసులోనే గర్భధారణ జరిగేలా చూసుకోవడం మంచిది.
2. గర్భధారణకు-గర్భాధారణకు మధ్య గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది. అందుకు కుటుంబ నియంత్రణ తాత్కాలిక చర్యలు పాటించాలి.
3. మహిళలు, గర్భిణీలు స్త్రీలు తగినంత ఆహారం తినాలి. రక్తహీనత నుండి రక్షణ పొందాలి. అయోడిన్ కలిపిన ఉప్పు వాడటం మంచిది.
4. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
5. గర్భవతి మహిళ తాను గర్భం పొందినప్పటినుండి తన బరువును నియంత్రించుకుంటూ వుండాలి. గర్భం ధరించిన నాటినుండి, ఆమె కడుపులోని బిడ్డకు కూడా అవసరమైన ఆహారాలను తీసుకుంటూండాటి. ఆమె తీసుకునే ఆహారమే, కడుపులోని బిడ్డకు కూడా పోషకాహారంగా మారి పిండం బరువెక్కుతూంటుంది. పిండం అధిక బరువు సంతరించుకుంటే, మహిళకు కాన్పు జరగటం కష్టంగా కూడా వుంటుంది. అందుకని ఆమె ఎప్పటికపుడు తగిన బరువును సంతరించుకుంటూ పోషకాహారాలను తీసుకోవాలి.



Click it and Unblock the Notifications