Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
గర్భిణీ స్త్రీలు బరువు నియంత్రణ... దానికి తగ్గ ఆహార నియమాలు...!
గర్భిణీ స్త్రీలు బరువు పెరగడంపై బెంగపడాల్సిన పనిలేదంటున్నారు వైద్యులు. ప్రతి ప్రసూతి వైద్యురాలు గర్భిణీ స్త్రీలు తొలి మాసం చెకప్‌కు వెళ్ళినప్పుడు బరువు కొలుస్తారు. ఆ తర్వాత బరువును కొలవరు. ఎందుకంటే ఆ తర్వాత బరువులో పెద్దగా మార్పు ఉండదు. తన సాధారణ బరువుకంటేకూడా గర్భందాల్చినప్పుడు బరువు పెరిగిందని గర్భిణీ స్త్రీలు అభిప్రాయపడుతుంటారు. దీనికి సంబంధించిన బెంగ అవసరం లేదంటున్నారు వైద్యులు. మహిళకు గర్భం ధరించాలంటే ఇష్టమే. కాని బరువు పెరుగుతామనేది భయాన్ని కలిగిస్తుంది. అందం తరిగిపోతుందని మరల ఒరిజినల్ షేపుకి రాలేమని భయాలుంటాయి. గర్భవతి అయినప్పటికి బరువు పెరగకుండా ఎప్పటికపుడు ఎలా నియంత్రించాలో... మహిళలు శిశువుకు జన్మనిచ్చిన తర్వాత తగిన వ్యాయామం, ఆహార నియమాలను పాటిస్తే శరీర బరువు సాధారణ స్థాయికి ఎలా తీసుకు రావాలో, అందుకోసం కొన్ని చిట్కాలను తీసుకొంటే మన వంత మనకు సహాయం చేసుకొన్న వాళ్ళం అవుతాం. ఆ చిట్కాలేంటో చూద్దాం...

డెలివరీ తర్వాత ఫిట్ గా వుండటమే కాదు, ఆరోగ్య సమస్యలు లేకుండా వుండాలన్నా కొన్ని ఆహార నియమాలు, వ్యాయామాలు పాటించితీరాలి. గర్భంతో వచ్చే కొవ్వు త్వరగా తగ్గదనే వాస్తవంకూడా గ్రహించండి. గర్భవతి వారానికోసారి బరువు పరీక్షించుకుంటూ వుండాలి. ఎప్పటికపుడు డాక్టర్ ను సంప్రదిస్తూ ఎంత మాత్రం బరువు వుండవచ్చో తెలుసుకుంటూ అధిక బరువు నివారించుకోవాలి.
బరువు నియంత్రణకు ఒక ఛార్టు పెట్టుకోండి. మీ బరువు, బాడీ మాస్ ఇండెక్స్, వయసు, ఎత్తు మొదలైనవి ఫిట్ నెస్ నిపుణులకిస్తే వారు గర్భస్ధదశలో కూడా మీబరువు నియంత్రిస్తారు. డెలివరీ తేలికగా అయ్యేటందుకు కొన్ని వ్యాయామాలు చేయండి. ప్రాణాయామం, స్ట్రెచెస్, ధ్యానం వంటివి శరీరాన్ని హాయిగొల్పేలా చేస్తాయి.
గర్భవతి ఆహారాలు ఎలా వుండాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాఫీ, టీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ లాంటివి తీసుకునే అలవాటుంటే వాటిని వెంటనే మానేయండి. కోకాకోలా, పెప్సీలాంటి చల్లని పానీయాలలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. గర్భవతిగా వున్నపుడు కూడా డైటింగ్ చేయవచ్చు. తప్పేమీ కాదు. సరి అయిన సమయానికి సరైన ఆహారం అనేది నియమంగా వుండాలి. ప్రొటీన్లు అధికంగా కల పప్పులు, మినరల్స్, విటమిన్లు వున్న కూరలు, ఒక చెంచాడు నెయ్యి వంటివి ప్రతి రోజూ సంతులిత ఆహారమే. అధిక బరువుండే స్త్రీలు గర్భవతి దశలో బరువు తగ్గాలంటూ వ్యాయామాలు చేస్తారు. ఇది సరికాదు. ప్రతి దశలోను పోషకాహార నిపుణులను సంప్రదించాలి.
గర్భిణీ స్త్రీలు తాము తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఆకు కూరలుండేలా చూసుకోవాలని వైద్యులు అంటున్నారు. గోధుమ రొట్టెలు లేదా సగ్గుబియ్యంతో చేసిన రొట్టెలు తమ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు తెలిపారు. మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోండి. అంటే కొన్ని తీపి పదార్థాలు మైదాతో తయారు చేస్తారు. ఎలాంటి పరిస్థితులలో మైదాను ఆహారంగా తీసుకోకూడదు. చీనీపండ్లు, ద్రాక్ష, అరటి పండ్లు ప్రతి రోజూ ఆహారంగా తీసుకోండి. అన్ని రకాల పప్పుదినుసులు, బీన్స్, పాలు, పెరుగు పదార్థాలు మీరు తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఇంకా ఎండు ద్రాక్ష, అక్రోట్, బాదంపప్పు తదితరాలు ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. వీటి ద్వారా శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.



Click it and Unblock the Notifications
