Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
గర్భిణీలు గ్రీన్ టీ త్రాగడం సురక్షితమే...
సాధారణంగా చాలా మంది మహిళలకు గర్భం ధరించే వరకూ ఎటువంటి ఆంక్షలు ఉండవు. వారు ఏపనులైన చకచక చక్కబెట్టేస్తారు. ఎటువంటి ఆహారాన్నైన చక్కగా తినేసి జీర్ణించుకోగల శక్తి వారిలో ఉంటుంది. ఒక్కసారి మహిళ గర్భం ధరించిన తర్వాత చేసే పనుల్లో మరియు తినే తిండిలో చాలా ఆక్షలు విధిస్తుంటారు. తల్లితో పాటు కడుపులో పెరిగే శిశువు యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉండాలని అలా సలహాలు ఇస్తుంటారు ఇంట్లో పెద్దలు మరియు వైద్యులు. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఉన్న అలవాట్లను సడన్ గా మానుకోవాలన్నా కొత్త పద్దతులను పాటించాలన్నా గర్భిణీ స్త్రీ మనస్సులో అనేక సందేహాలు ఏర్పడుతాయి. అటువంటి సందేహాల్లో ఒక్కటే గ్రీన్ టీ. గర్భిణీ స్త్రీ గ్రీన్ టీ త్రావచ్చా? గ్రీన్ టీ వల్ల భద్రత మరియు ఆరోగ్య అంశాలను గురించి తెలుసుకొని డాక్టర్ సలహా ప్రకారం తాగాల్సి ఉంటుంది.
గర్భధారణ సమయంలో దగ్గు మరియు జలుబు నివారించే మార్గాలు
గతంలో గ్రీన్ టీని గర్భిణీ స్త్రీలు కూడా తావచ్చని గ్రీన్ టీ లో అనేక ఔషధ గుణాలున్నాయని, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో గ్రీన్ టీ త్రాగడం వల్ల ఆరోగ్యానికి పూర్తిగా లాభదాయం అని భావించబడింది. అయితే రీసెంట్ గా చేసిన కొన్ని అధ్యయనాలు వల్ల గర్భధారణ సమయంలో గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని సూచిస్తున్నాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ప్రమాదకరమైన గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల జాగ్రత్తగా ఉండటం ఉత్తమమైన మార్గం. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం ఎందుకు సురక్షితం కాదు? అని తెలిపే కొన్ని నిజాలను పరిశీలించండి...

గర్భిణీలో ఫోలీక్ యాసిడ్స్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది:
గ్రీన్ టీ తాగడం పెరిగినప్పుడు శరీరంలోని ఫోలిక్ యాసిడ్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఫొల్లేట్ లోపం వల్ల శిశువు యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ ట్యూబ్ పూర్గిగా మూసుకుపోవచ్చు దాంతో వెన్నెముక చీలిక, నాడీ సంబంధ నాళిక లోపాలకు కారణం కావచ్చు.

కెఫిన్ యొక్క ప్రభావం:
మీకు తెలుసా గ్రీన్ టీలో కూడా కొంత మొత్తంలో కెఫిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి గర్భధారణ సమయంలో తగు మోతాదులో మాత్రమే టీ, కాఫీ, త్రాగమని సిఫార్సు చేస్తుంటారు. అదే విషయం గ్రీన్ టీకి కూడా వర్తిస్తుంది.

శరీరంలోని ఇనుము శోషణ గావింపబడుతుంది:
ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపడంతో పాటు గర్భిణీ శరీరంలో ఐరన్ శాతాన్ని తగ్గించేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఐరన్ చాలా ముఖ్యమైనటువంటి పోషకాంశము. కాబట్టి గ్రీన్ టీని గర్భదారణ నియంత్రించబడింది.

శిశువు తక్కువ బరువుతో పుట్టడం:
గ్రీన్ టీని అధికంగా తీసుకొనే గర్భిణీ స్త్రీలలో అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు పుట్టే అవకాశంలో ఉంటుందని కనుగొన్నారు. ఇది గ్రీన్ టీలోని కెఫిన్ వల్లే ఇలా ప్రభావం చూపిస్తుందని పరిగణిస్తారు. గ్రీన్ టీలో 25-50mg కెఫిన్ ఉండి వివిధర రకాలుగా ఆధారపడి పనిచేస్తుంది.

డీహైడ్రేషన్:
కెఫిన్ ఒక మూత్ర విసర్జన ప్రేరకంగా ఉంటుంది, కనుక గర్భధారణ సమయంలో ఒంట్లో నీటిశాతాన్ని తగ్గించేస్తుంది కాబట్టి, ప్రెగ్నెన్సీ టైమ్ లో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి గర్భధారణ సమంయలో తగు మోతాదలో మాత్రమే డాక్టర్ల సలహా మీద గ్రీన్ టీ త్రాగాలి.

కెఫిన్ మాయ దాటుతుంది:
కెఫిన్ రక్తప్రసరణ ద్వారా శిశువు గర్భశయ మాయలో ప్రవేశించి శిశువుకు చేరుతుంది. దాంతో కడుపులో పెరుగుతున్న శిశువు యొక్క జీవక్రియ పరిపక్వత లోపిస్తుంది. కెఫిన్ శిశువు యొక్క అభివ్ద్దిని అడ్డుకుంటుంది. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ యొక్క ప్రమాదకర ఫలితాలను ఇన్ని అధ్యయనాలు చూపించబడి ఉన్నాయి కాబట్టి, గర్భధారణ సమయంలో తగు మోతాదులో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండాలంటే ప్రస్తుతానికి గ్రీన్ టీకి సారిచెప్పడమే ఉత్తమైన మార్గం.



Click it and Unblock the Notifications