Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
గర్భిణీ చింతపండు లేదా చింతకాయలు తినడం వల్ల పొందే ప్రయోజనాలు.!!
చింతకాయలను ఏషియా మరియు ఆఫ్రీకాలో ఎక్కువగా పండిస్తారు. పుల్లపుల్లగా ఉండే చింతపండులో మెడిసినల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఈతియ్యనిపుల్లని చింత పండు, గర్భిణీ స్త్రీలలో వికారం, వాంతులు మరియు మార్నింగ్ సిక్ నెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అయితే ఏది కూడా కానీ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
అయితే గర్భిణీలు చింతకాయ లేదా చింత పండు తినడం సురక్షితమేనా ? సురక్షితమో కాదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ గురించి పూర్తిగా తెలుసుకోవల్సిందే...

విటమిన్ సి అధికంగా ఉంటుంది:
చింతపండులో ఉండే విటమిన్ సి హెల్తీ న్యూట్రీషియన్ . దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. ఐతే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. విటమిన్ సి మోతాదుకు మించి తీసుకుంటే గర్భిణీకి ప్రమాదం. మిస్కరేజ్ అయ్యే చాన్సెస్ ఎక్కువ . విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందు ముందు ప్రొజెస్టరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది . దాంతో గర్భస్రావానికి కారణమవుతుంది.

ల్యాక్సేటివ్ :
చింతపండు మోడ్రన్ లాక్సేటివ్ గా పనిచేస్తుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. గర్భధారణ సమయంలో ఇది సాధారణసమస్య. గర్భిణీల ఎక్కువ చింతపండు తింటే ల్యాక్సేటివ్ డయోరియాకు కారణమవుతుంది.ఇది గర్భధారణ సమయంలో అత్యంత ప్రమాధకరం. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది .

యాస్సిరిన్ ఇంటరాక్షన్:
యాస్పిరిన్ చింతపండుతో ఇంటరాక్ట్ అవుతుంది. గర్భిణీలు యాస్పిరిన్ తీసుకోనేటప్పుడు చింతపండు తినకూడదు. అలా తీసుకున్నట్లైతే ఈ క్రింది సమస్యలకు దారితీస్తుంది. చింత పండు తింటే యాస్పిరిన్ మరింత ఎక్కువ అబ్సార్బ్ అవుతుంది. ఆస్పిరిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల గర్భస్రావానికి కారణమవ్వచ్చు.ఆస్పిరిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేట్ ప్రెగ్నెన్సీ మరియు ప్రసవం ఆలస్యమవ్వడానికి కారణమవుతుంది . ఆస్పిరిన్ వల్ల చిన్న పిల్లల్లో హార్ట్ మరియు లంగ్స్ సమస్యలకు దారితీస్తుంది.

ఐబ్రూఫిన్ ఇంటరాక్షన్
యాస్పిరిన్ వలే ఐబ్రూఫిన్ శరీరంలో త్వరగా ఆబ్సార్బ్ అవుతుంది. చింతపండు ఐబ్రూఫిన్ ఇంటరాక్షన్ ఆరోగ్యానికి చాలా హానికరం. మూడవ థ్రైమాసికంలో తీసుకునే మెడికేషన్స్ లో ఐబ్రూఫిన్ క్యాటగిరిని డి డ్రంగ్ గా విభజించారు. అంటే మూడవథ్రైమాసికంలో ఐబ్రూఫిన్ మితంగా తీసుకోవడం గర్భిణీ ఆరోగ్యానికి మంచిది.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది
చింతపండు గుజ్జు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. బైల్ డిజార్డర్స్ కు ఇది నేచురల్ ట్రీట్మెంట్ . ఇది ఆకలిని పెంచుతుంది .

ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది
చింతపండులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి . ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. దాంతో కాన్సర్ ప్రమాదం ఉండదు.

గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి
గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ సహజం. కాబట్టి, గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

గర్భధారణ సమయంలో ఫ్లోరోసిస్ తో బాధపడే వారికి ప్రమాదం
గర్భధారణ సమయంలో ఫ్లోరోసిస్ తో బాధపడే వారు చింతపండు తినడం ఆరోగ్యానికి హానికరం.

బ్లడ్ ప్రెజర్ లెవల్ కంట్రోల్ చేస్తుంది.
కొంత మంది బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతుంటారు. చింత పండులో ఉండే వివిధ రకాల మినిరల్స్ , పొటాషియం, సోడియం, ఐరన్ మొదలగునవి బ్లడ్ ప్రెజర్ లెవల్ కంట్రోల్ చేస్తుంది.

మలబద్దకం, పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.
గర్భిణీలు, చింతపండును మితంగా తీసుకోవడం వల్ల మలబద్దకం, పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications