Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గర్భిణీలు పుస్తకాలు చదవాలని, మంత్రాలు పఠించాలని ఎందుకు చెబుతారు?
గర్భిణీలు సుందరకాండ, రామాయణం వంటి ఇతిహాసాలు చదవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. పురాణ ఇతిహాసాలు చదివితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్న పిల్లలు పుడతారని పేర్కొన్నారు. గైనకాలజిస్ట్, ఫీటల్ థెరపిస్ట్ అయిన తమిళిసై.. ఓ కార్యక్రమం సందర్భంగా ఈ సలహా ఇచ్చారు.
గర్భధారణ సమయంలో సుందరకాండ చదివితే పిల్లలకు చాలా మంచిదని ఆమె తెలిపారు. రామాయణంలో ఓ అధ్యాయమైన సుందరకాండలో హనుమంతుని సాహసాలు, ఆయన నిస్వార్థత, బలం, శ్రీరాముని పట్ల భక్తి గురించి ఉంటుంది. ఇది చదివితే మానసికంగా దృఢత్వం కలిగిన పిల్లలు పుడతారని గవర్నర్ సూచించారు.

గర్భధారణ సమయంలో పుస్తకాలు చదివితే ప్రయోజనాలు:
గర్భధారణ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. పుస్తక పఠనం రక్తపోటు, హృదయ స్పందన రేటును తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. పుస్తక పఠనం నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.
గర్భధారణ సమయంలో ఎదురయ్యే సవాళ్ల గురించి ముందే తెలుసుకోవచ్చు. ఇతరుల అనుభవాల గురించి చదవడం ద్వారా, గర్భం, ప్రసవం యొక్క వివిధ దశల గురించి, అలాగే పిల్లలను పెంచడంలో సవాళ్ల గురించి తెలుసుకోవచ్చు. ప్రసవం జరిగినప్పుడు మరింత సన్నద్ధతతో, తక్కువ ఒత్తిడితో ఉండవచ్చు.
మంత్రాలు పఠించడం:
మంత్రాలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూజాది కార్యక్రమాలు, శుభకార్యాల సమయంలో దేవుడిని స్మరిస్తూ చేసేవి మంత్రాలు. అవి మనస్సును శాంతపరచడానికి శక్తివంతమైన మార్గంగా పరిగణించబడుతున్నాయి. మంత్రాలు పఠించడం వల్ల సానుకూల ప్రకంపనలు విడుదలై అవి గర్భంలోని శిశువుకు మేలు చేస్తాయని అంటారు. అది శిశువు మానసిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మంత్రాలు పఠించడం ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. అది నాణ్యమైన నిద్రను అందిస్తాయి.
- ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది
- మెరుగైన నిద్ర అందుతుంది
- స్వీయ అవగాహ, విశ్వాసం పెరుగుతుంది
- భావోద్వేగ శ్రేయస్సు మెరుగుపడుతుంది
- శిశువుతో మెరుగైన బంధం ఏర్పడుతుంది
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
