Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే.. ఈ చిట్కాలను పాటించిండి..! ఇవి వైద్యుల సూచనలు..!
కొందరికి ప్రెగ్నెన్సీ తొందరగా రాదు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వుంటారు. అలాంటి వారు చాలా జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రముఖ వైద్యులు, పరిశోధకులు సూచించిన జాగ్రత్తలను మీకు తెలియజేస్తున్నాము. వీటిని పాటిస్తే మీకు ఖచ్ఛితంగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం వుంటుంది.
గర్భం దాల్చాలంటే ముందుగా తల్లీ, తండ్రీ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలి. 30 ఏళ్లు పైబడిన వాళ్లల్లో ప్రెగ్నెన్సీకి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్ి ఆరగ్యం విషయంలో, డైట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితం వుంటుంది.
ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే రుతు ప్రావం రెగులర్‌గా వుండాలి. దీని కోసం పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. బరువులు ఎక్కువగా మోయవద్దు. రెగులర్ పీరియడ్స్ వున్న వారిలో గర్భం దాల్చడం చాలా సులువని వైద్యులు చెబుతున్నారు. ప్రతి 21 నుంచి 30 రోజుల వరకు ప్రతి నెల పీరియడ్స్ రావాల్సిన అవసరం వుంది. దీని వల్ల ఎప్పుడు అండం విడుదలవుతుందో తెలుసుకునే అవకాశం వుంది.

తల్లిలో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, తండ్రిలో వీర్య కణాలు బాగా వున్నాయా లేదా లాంటి పరీక్షలను ముందుగానే చేయించుకోవాలి. గర్భ ధారనకే కాకుండా గర్భం దాల్చిన తరువాత ఫాలిక్ యాసిడ్ చాలా ఉపయోగపడుతుంది. ఫాలిక్ యాసిడ్ లోపిస్తే కడుపులో బిడ్డ అవయవాలు సరిగ్గా పెరిగే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయ్. పిల్లల్లో జెనెటిక్ సమస్యలు రాకుండా వుండడానికి కూడా ఫాలిక్ యాసిడ్ చాలా దోహదపడుతుంది.
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మూడు నెలల ముందు నుంచే ఫాలిక్ యాసిడ్ తీసుకోవడాన్ని ప్రారంభించాలి. దీంతో పాటు వైటమిన్ డీ కూడా తీసుకోవాల్సిన అవసరం వుందని వైద్యులు చెబుతున్నారు. 30, 35 ఏళ్ల పైబడిన వారు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా తీసుకోవాలి.
తండ్రికి వీర్య కణాల పరీక్షలను చేయించాలి. దానికి అవసరమైన ఔషధాలను కూడా ఖచ్ఛితంగా వాడాలి. తల్లిదండ్రీ ఇద్దరూ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయ్. ప్రొటీన్లు, వైటమిన్లు, అమినో ఫ్యాటీ యాసిడ్లు, ఎలాంటి కెమికల్స్ ఉపయోగించని ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల అండం ఆరోగ్యంగా విడుదలవుతుంది. లేదంటే పుట్టే బిడ్డ కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
జంక్ ఫుడ్‌లు, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ లకు దూరంగా వుండాలి. లేదంటే ప్రెగ్నీసికి ఇవి కూడా అడ్డుగా మారుతాయ్. ఇందులో వుండే హానికర పదార్ధాలు, కెమికల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. ప్రతి రోజూ యోగా, వ్యాయామం చేయడం వల్ల కూడా అండం ఆరోగ్యంగా విడుదలయ్యే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఎక్కువ వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
35 ఏళ్లు దాటిన వారిలో సహజంగా ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం. ఇలాంటి వారు ఖచ్ఛితంగా వైద్యులను సంప్రదించి దానికి అవసరమై ఆహారాలను, మందులను తీసుకోవాల్సిన అవసరం వుంది. పొగ తాగడం, మద్యం తాగే అలవాటు వున్న ఆపివేయాలని వైద్యులు చెబుతున్నారు. కాఫీ, టీ తాగకపోయినా జరిగే నష్టం ఏమీ లేదని, అది ప్రెగ్నెన్సీకి మరింత సహాయపడుతుందని అంటున్నారు.
రోజు విడిచి రోజు శృంగారంలో భార్యా భర్తలు కలిస్తేనే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలు వుంటాయ్. ఈ రోజుల్లోనే కలుస్తామని నిర్ణయించుకుటే ఫతితం వుండదని అంటున్నారు. అధికబరువు కూడా ప్రెగ్నెన్సీకి అడ్డుగా వుంటుందని అంటున్నారు. బరువు తగ్గిన తరువాతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలంటున్నారు.



Click it and Unblock the Notifications
