Latest Updates
-
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'!
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలామంది గ్యాస్, అజీర్ఱం,మలబద్దం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపుతున్నారు. అయితే ఇలాంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపే ఆయుర్వేద దివ్యౌషధమే త్రిఫల చూర్ణం. రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక స్పూను త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే ఉదయానికి పొట్ట సమస్యలన్నీ ఇట్టే మాయమవుతాయి.
అంతేకాకుండా అధిక బరువు తగ్గాలనుకునే వారికి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారికి ఇది గొప్ప వరం లాంటిది. కంటి చూపును మెరుగుపరచడం, వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉంచడం,చర్మంపై ముడతలు రాకుండా కాపాడటంలో కూడా త్రిఫల అమోఘంగా పనిచేస్తుంది. ఎలాంటి కల్తీ లేకుండా, వంద శాతం స్వచ్ఛమైన త్రిఫల చూర్ణాన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో చూడండి.

త్రిఫల చూర్ణం తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉసిరికాయ
-కరక్కాయ
-తానికాయ
Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు!
త్రిఫల చూర్ణం తయారీ విధానం
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం త్రిఫల చూర్ణం అత్యంత ప్రభావవంతంగా పనిచేయాలంటే ఈ మూడింటినీ 1:2:3 నిష్పత్తిలో మాత్రమే తీసుకోవాలి. అంటే 1 భాగం కరక్కాయ, 2 భాగాలు తానికాయ, 3 భాగాలు ఉసిరికాయ ఉండాలి. ఉదాహరణకు.. 20 గ్రాముల కరక్కాయ, 40 గ్రాముల తానికాయ, 60 గ్రాముల ఉసిరికాయలను తీసుకోవాలి.
-ముందుగా 20 గ్రాముల కరక్కాయలను తీసుకుని, ఎండలో బాగా ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఎండిన తర్వాత, దంచి వాటిలోని గింజలను జాగ్రత్తగా తొలగించి, మిక్సీలో వేసి మెత్తని పొడిలా పట్టుకోవాలి.
-ఆ తర్వాత 40 గ్రాముల తానికాయలను కూడా తీసుకుని, ఎండలో ఉంచి ఆరబెట్టాలి. గింజలు తీసేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు 60 గ్రాముల ఎండిన ఉసిరి ముక్కలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా చూసుకుని, గింజలు ఏమైనా ఉంటే తీసేసి మిక్సీలో పొడి చేయాలి.
-మీకు సమయం ఆదా కావాలనుకుంటే, ఈ మూడింటినీ ఒకేసారి కలిపి కూడా మిక్సీలో మెత్తని చూర్ణంగా రుబ్బుకోవచ్చు. లేదా విడివిడిగా పొడి చేసుకుని, ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవచ్చు.
-ఇలా తయారైన ఈ స్వచ్ఛమైన త్రిఫల చూర్ణాన్ని గాలి చొరబడని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే, దీర్ఘకాలం పాటు ఏమాత్రం పాడవకుండా ఉంటుంది.
-త్రిఫల కాస్త వగరుగా, చేదుగా ఉంటుంది. కాబట్టి, ఆ రుచి ఇష్టపడని వారు ఈ చూర్ణానికి ఒక స్పూన్ నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) కలుపుకోవచ్చు. దీనివల్ల రుచి మెరుగవ్వడమే కాకుండా పొట్టకు కూడా చాలా మంచిది.
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే..
త్రిఫల చూర్ణంలోని అద్భుత ప్రయోజనాలు
ఉసిరికాయ: ఇందులో విటమిన్ సి తో పాటు పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి, అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది.
కరక్కాయ: ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, మనం తిన్న ఆహారం సాఫీగా అరిగేలా చేస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకం నుండి శాశ్వత ఉపశమనం కలిగించడంలో దీనికి సాటి లేదు.
తానికాయ: ఇది శరీరాన్ని లోపలి నుండి సమూలంగా శుభ్రపరుస్తుంది. రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను బలపరిచి, జలుబు, ఆస్తమా వంటి సమస్యలను దూరం చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
