Latest Updates
-
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
మేక పాలలోని ఈ రహస్యం మీకు తెలుసా? ఆ సమస్యకు ఇదే బెస్ట్! -
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్! -
కర్కాటకంలో గురు సంచారం.. అక్టోబర్ వరకు స్టడీస్, కెరీర్లో ఈ రాశుల వారికి ఎనలేని భాగ్యం.! -
లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకునేలా ‘గీ రైస్’.. ముస్లిం వెడ్డింగ్ స్టైల్లో ఇలా చేసేయండి.! -
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం.. పాలు లేకుండానే ఎంతో టేస్టీగా.! -
మెనోపాజ్ తర్వాత తీవ్రంగా కీళ్లు, ఎముకల సమస్య.. ఇందుకు కారణాలేంటి.. ఎలా బయటపడాలి.?
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే..
హోటల్స్ లో దొరికే మినప వడలు పైన కరకరలాడుతూ, లోపల ఎంతో మెత్తగా, రుచిగా ఉంటాయి. అచ్చం అలాంటి రుచితో, అదే ఆకృతిలో ఇంట్లోనే మినప వడలను తయారు చేసుకోవడం చాలా సులువు.
కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే నూనె పీల్చకుండా పైన క్రిస్పీ లేయరతో లోపల స్పాంజీలా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. గ్రైండర్ అక్కర్లేకుండా మిక్సీలో రుబ్బిన పిండితోనే కరకరలాడుతూ హోటల్ స్టైల్ లో మినప వడలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మినప వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపగుళ్లు
-బియ్యం పిండి
-బొంబాయి రవ్వ
-వంటసోడా
-ఉప్పు
-కరివేపాకు
-అల్లం
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయ
-ఇంగువ
-మిరియాల పొడి
-ఆయిల్
బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్!
మినప వడలు తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 గ్లాసు(250 గ్రా) మినపగుళ్లు వేసి ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఇందులో నీళ్లు పోసి కనీసం 2-4 గంటల సేపు నానబెట్టుకోవాలి.
-పప్పు బాగా నానిత తర్వాత మళ్లీ ఒకటి రెండు సార్లు శుభ్రంగా మినపగుళ్లను కడుక్కోవాలి.
-తర్వాత ఈ పప్పును నీళ్లు అస్సలు లేకుండా మిక్సీ గిన్నెలో సగం వేసుకోండి. ఇందులో 1 టీస్పూన్ ఉప్పు కూడా వేసి మెత్తగా వెన్నలా గ్రైండ్ చేసుకోండి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత మిగిలిన పప్పును కూడా మిక్సీ గిన్నెలో వేసి కొంచెం ఉప్పు వేసి దాన్ని కూడా మెత్తగా వెన్నలా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ లేదా ఇడ్లీ రవ్వ వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు చేతిని నీటతో తడుపుకొని పిండిని ఆ చేత్తో బాగా అద్ది మూతపెట్టి అరగంట సేపు పిండిని పక్కన పెట్టేసుకోండి.
-అరగంట తర్వాత మూత తీసి అందులో చిటికెడు వంటసోడా, పావు టీస్పూన్ ఇంగువ వేసి స్పూన్ తో బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తురిమిన అల్లం, 1 కప్పు ఉల్లిపాయ మీడియం సైజ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. తర్వాత చేతిని తడుపుకొని పిండిని కొంచెం చేతుల్లోకి తీసుకొని వడల్లా వత్తుకొని ఆయిల్ లో వేసి వేయించుకొని బయటకు తీసుకొని స్టవ్ ఆపేయాలి.
-అంతే హోటల్ స్టైల్ మినప వడలు రెడీ. వీటిని వేడివేడిగా ఇడ్లీతో పాటే సాంబార్, కొబ్బరి చట్నీ, లేదా పల్లి చట్నీతో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications