Latest Updates
-
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే క్యాబేజీ పల్లీ రైస్.. లంచ్ బాక్స్ లోకి ఈజీగా.. అమృతం టేస్ట్! -
భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారని తెలిపే గ్రీన్ ఫ్లాగ్స్.. ఇవి మీ బంధంలో ఉన్నాయా.? -
మళ్లీ ప్రాణం పోసుకున్న రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు! -
మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ.. ఇలా చేస్తే అచ్చం హోటల్ రుచి పక్కా! -
ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు, బూజు.. వీటిని తినడం సురక్షితమేనా.? -
అమ్మ పెళ్లి కుదిర్చిందని గుండు గీయించుకున్న యువతి.. నెట్టింట వైరల్.. పుకారా, నిజమా.? -
చిన్నారుల ఫేవరెట్.. లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రసం రైస్.. కొత్తగా ఇలా చేయండి.! -
భాగస్వామితో గొడవైనప్పుడు పొరపాటున కూడా ఇలా చేయకండి.! -
‘తక్షణ మెరుపు’ అపోహ.. చర్మ సంరక్షణలో అతివలు చేస్తున్న అతిపెద్ద తప్పులు ఇవే.! -
ఫోలిక్ యాసిడ్ ఒక్కటే కాదు.. కాబోయే తల్లికి అత్యవసరమయ్యే పోషకాలు ఇవే.!
10 నిమిషాల్లో అదిరిపోయే ఆంధ్రా మామిడికాయ తురుము పచ్చడి.. వేడి అన్నంలోకి అమృతం!
ఎండాకాలంలో మామిడికాయతో రకరకాల పచ్చళ్లు పట్టుకోవడం మన ఇళ్లల్లో ఆనవాయితీ. సాధారణంగా మనం మామిడికాయలను ముక్కలుగా కోసి ఆవకాయ లేదా ముక్కల పచ్చడి పెడుతుంటాం. కానీ, ఎప్పుడైనా మామిడికాయను క్యారెట్ లా సన్నగా తురిమి పచ్చడి చేశారా? దీని రుచి అమృతంలా ఉంటుంది.
అప్పటికప్పుడు పది నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. నోరూరించే ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మామిడికాయ తురుము పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయ తురుము - 1 కప్పు
కాశ్మీరీ కారం - 4 టేబుల్ స్పూన్లు (
పసుపు - 1 టేబుల్ స్పూన్
మెంతులు - అర టేబుల్ స్పూన్
నువ్వుల నూనె- అర కప్పు
ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 2
అల్లం -పావు టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - రుచికి తగినంత
మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో మెంతులను వేసి కమ్మటి సువాసన వచ్చే వరకు సన్నని మంటపై దోరగా వేయించండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పచ్చి మామిడికాయ తొక్క తీసి కొంచెం లావుగా తరుముకోవాలి.
-ఒక పెద్ద గాజు లేదా స్టీల్ గిన్నె తీసుకుని అందులో పచ్చి మామిడికాయ తురుము, కశ్మీరీ కారం, పసుపు, వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి వేసి అన్నీ బాగా కలిసేలా గరిటతో కలపండి. ఆ తర్వాత అందులో రెండు చెంచాల ఉప్పు వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచి నాననివ్వండి.
-ఇప్పుడు తాలింపు కోసం.. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నువ్వుల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతూ వేగుతున్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా, బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి. వెల్లుల్లి రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసేయండి. వెంటనే ఆ వేడి నూనెలో సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు వేసి కలపండి. ఈ తాలింపును పూర్తిగా చల్లారనివ్వండి.
-తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత దానిని కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న మామిడి తురుము మిశ్రమంలో పోసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి.
-అంతే ఘుమఘుమలాడే, నోరూరించే ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఈ పచ్చడిని గాలి చొరబడని ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోండి. ఫ్రిజ్ లో పెడితే కనీసం వారం రోజుల పాటు ఇది తాజాగా, ఎంతో రుచిగా ఉంటుంది.
-వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే స్వర్గమే. అలాగే ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్స్ లోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications