ఆలూ ఛాట్ తయారీ విధానం ; ఘాటైన ఆలూ ఛాట్ ఎలా తయారుచెయ్యాలి

By: Deepti
Subscribe to Boldsky

ఆలూ ఛాట్ చాలా ప్రసిద్ధమైన సాయంకాలపు తినుబండారం. ఢిల్లీ వీధుల్లో పుట్టిన ఈ పదార్థం, ఇప్పుడు అందరికీ ప్రియమైనది, చిరపరిచితమైనది. పేరు వింటేనే నోరూరుతోంది కదూ? ఇంకా, బంగాళాదుంపలు వాడకం వల్ల రుచి రెట్టింపవుతుంది.

ఈ రుచికర తినుబండారం తయారుచెయ్యడం నేర్చుకోవాలనుకుంటే, వీడియో, ఫోటోలతో కూడిన ఈ వ్యాసాన్ని మొత్తం చదవండి.

ఈ దిల్లీ ఆలూ ఛాట్ తయారీ చాలా త్వరగా అయిపోయి, ఆకలి కూడా తీరుస్తుంది. ఇందులోని కరకరలాడే పదార్థాలు, వేగినా మెత్తగా ఉండే బంగాళదుంపలు, అలల్లాగా తగులుతూపోయే ఘాటు దినుసులు మన నాలుకకి ఇంకా ఇంకా కావాలనిపించేట్లా చేస్తాయి. కంటికి, కడుపుకి విందైన ఈ ఆలూ ఛాట్ తయారీ ఇక నేర్చుకోండి.

ఆలూ ఛాట్ రిసిపి వీడియో

ఆలూ ఛాట్ తయారీ విధానం ; ఘాటైన ఆలూ ఛాట్ ఎలా తయారుచెయ్యాలి
Aloo Chaat Recipe | How To Make Aloo Chaat
Aloo Chaat Recipe | How To Make Aloo Chaat
Prep Time
10 Mins
Cook Time
20 Minutes
Total Time
30 Mins

Recipe By: ప్రియాంక త్యాగి

Recipe Type: సాయంకాలపు చిరుతిండి

Serves: 3-4 గురికి

Ingredients
 • బంగాళదుంపలు (చెక్కుతీసినవి, ముక్కలు చేసినవి) -500 గ్రాములు

  నూనె- వేయించటానికి

  ఉప్పు - ½ చెంచా

  కాశ్మీరీ కారం- ½ చెంచా

  మామిడి పొడి (ఆమ్ చూర్)-1/2 చెంచా

  వేయించిన జీలకర్ర పొడి-1/2 చెంచా

  ఛాట్ మసాలా-1/2 చెంచా

  నిమ్మరసం-1 చెంచా

  చింతపచ్చడి- చెంచా

  కొత్తిమీర పుదీనా పచ్చడి- ½ చెంచా

  కారప్పూస- ఒక చిన్న కప్పు

  కొత్తిమీర (బాగా తరిగినది)- పైన అలంకరణకి

  దానిమ్మ- పైన అలంకరణకి

Red Rice Kanda Poha
How to Prepare
 • 1.బాణాలిలో నూనె వేసి మరగనివ్వండి, బంగాళాదుంపల ముక్కలను వేయించండి.

  2.బంగారు రంగులోకి వచ్చాక, వాటిని తీసేయండి.

  3.ఉప్పు,కారం వేయండి

  4.తర్వాత, ఎండిన మామిడిపొడి (ఆమ్ చూర్), వేయించిన జీలకర్ర పొడి, ఛాట్ మసాలా వేయండి.

  5.నిమ్మరసం కూడా వేసి బాగా మిశ్రమాన్ని కలపండి.

  6.చింత,కొత్తిమీర-పుదీనా చట్నీలను కూడా వేసి బాగా కలపండి.

  7.కారప్పూస, కొత్తిమీర, దానిమ్మ గింజలను పైన చల్లండి

  8.కొంచెం చట్నీలను మళ్ళీ పైన వేస్తే రంగురంగుల్లో అందంగా మీ ఛాట్ రెడీ.

Instructions
 • దినుసులను మీ అభిరుచికి తగ్గట్టు మార్చుకోవచ్చు
 • డైటింగ్ చేసేవాళ్ళు బంగాళాదుంపలను వేయించుకోకుండా ఉడికించుకోవచ్చు.
Nutritional Information
 • క్యాలరీలు - 334 కాలరీలు
 • ప్రొటీన్లు - 3.2 గ్రాములు
 • కార్బొహైడ్రేట్ - 18.7 గ్రాములు
 • ఫైబర్ - 3.6 గ్రాములు

ఎలా తయారుచెయ్యాలి

1.బాణాలిలో నూనె వేసి మరగనివ్వండి, బంగాళాదుంపల ముక్కలను వేయించండి.

స్పైసీ ఆలూ ఛాట్ రిసిపి
స్పైసీ ఆలూ ఛాట్ రిసిపి

2.బంగారు రంగులోకి వచ్చాక, వాటిని తీసేయండి.

Aloo Chaat Reciep

3.ఉప్పు,కారం వేయండి

Aloo Chaat Reciep
Aloo Chaat Reciep

4.తర్వాత, ఎండిన మామిడిపొడి (ఆమ్ చూర్), వేయించిన జీలకర్ర పొడి, ఛాట్ మసాలా వేయండి.

Aloo Chaat Reciep
Aloo Chaat Reciep
Aloo Chaat Reciep

5.నిమ్మరసం కూడా వేసి బాగా మిశ్రమాన్ని కలపండి.

Aloo Chaat Reciep
Aloo Chaat Reciep

6.చింత,కొత్తిమీర-పుదీనా చట్నీలను కూడా వేసి బాగా కలపండి.

Aloo Chaat Reciep
Aloo Chaat Reciep
Aloo Chaat Reciep

7.కారప్పూస, కొత్తిమీర, దానిమ్మ గింజలను పైన చల్లండి

Aloo Chaat Reciep
Aloo Chaat Reciep
Aloo Chaat Reciep

8.కొంచెం చట్నీలను మళ్ళీ పైన వేస్తే రంగురంగుల్లో అందంగా మీ ఛాట్ రెడీ.

Aloo Chaat Reciep

Please Wait while comments are loading...
Subscribe Newsletter