Latest Updates
-
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచి, చర్మానికి మెరుపునిచ్చే తులసి తమలపాకు రసం..ఎలా చేసుకోవాలంటే.. -
మెగ్నీషియం లోపం వేధిస్తోందా? కండరాల నొప్పులు, అలసట తగ్గించే 5 ఫుడ్స్ ఇవే! -
కార్తీకమాసం స్పెషల్.. ఘుమఘుమలాడే అసలైన బ్రాహ్మిణ్ స్టైల్ సాంబార్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే.. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. ధర ఎంతో తెలుసా..? -
గంటల సమయం పట్టకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేసుకోండిలా! -
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్ -
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి! -
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. -
బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా..
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు!
కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంటకాలలో మలబార్ చికెన్ బిర్యానీ ఒకటి. అందుకే మీరు ఈసారి బిర్యానీ చేయాలనుకున్నప్పుడు, దీనిని తప్పకుండా ప్రయత్నించండి. సాధారణ బిర్యానీలా కాకుండా తెలుపు రంగులో విభిన్నంగా ఉండే ఈ వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం.
ఎంత పెద్ద మొత్తంలోనైనా, బ్యాచిలర్లు కూడా దీనిని ఎంతో సులువుగా వండేయవచ్చు. మలబార్ చికెన్ బిర్యానీ మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మసాలా కోసం:
1 కిలో కోడి మాంసం
4 పెద్ద ఉల్లిపాయలు
6 పచ్చిమిర్చి
1 కప్పు కొబ్బరి నూనె
1 బిర్యానీ ఆకు
దాల్చిన చెక్క ముక్క
5 యాలకులు
4 లవంగాలు
1 అనాసపువ్వు
1 చెంచా సోంపు
2 తరిగిన టమాటాలు
3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
1 కప్పు పెరుగు
రుచికి సరిపడా ఉప్పు
1 చెంచా పసుపు
2 చెంచాల కారం
2 చెంచాల ధనియాల పొడి
1 చెంచా గరం మసాలా
2 చెంచాల జీలకర్ర పొడి
గుప్పెడు కరివేపాకు
అర కప్పు కొత్తిమీర
అర కప్పు పుదీనా
అన్నం కోసం:
అర కిలో బాస్మతి బియ్యం
తగినంత నీరు
1 బిర్యానీ ఆకు
దాల్చిన చెక్క ముక్క
5 యాలకులు
4 లవంగాలు
1 అనాసపువ్వు
1 టీస్పూన్ సోంపు
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి!
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టండి. తర్వాత బిర్యానీ బాండీలో కొబ్బరి నూనెను వేడి చేసి, తరిగిన మూడు ఉల్లిపాయల పొడవాటి చీలికలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే నూనెలో మసాలా దినుసులను వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ముక్కలు, కరివేపాకు వేసి గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించండి. తర్వాత తరిగిన టమాటాలు వేసి మెత్తగా ఉడికించాలి.
-టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత శుభ్రం చేసిన చికెన్, పచ్చిమిర్చి, అన్ని మసాలా పొడులను వేసి బాగా కలపండి. అందులోనే పెరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి, మూత పెట్టి చికెన్ మెత్తబడే వరకు ఉడికించండి. చికెన్ ఉడికాక సగం మసాలాను ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచండి.
-మరోవైపు ఒక పాత్రలో నీళ్లు పోసి, ఉప్పు, అన్నం కోసం తీసుకున్న మసాలా దినుసులు వేసి మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి ఎనిమిది నుండి పది నిమిషాల పాటు ఉడికించి, నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు బాండీలోని సగం మసాలాపై సగం అన్నాన్ని పరచండి. దానిపైన కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు చల్లండి. ఆ తర్వాత మిగిలిన మసాలాను వేసి, దానిపైన మిగిలిన అన్నం, కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలను మరో పొరగా అమర్చండి. గిన్నెకు మూత పెట్టి, చాలా తక్కువ మంట మీద ముప్పై నిమిషాల పాటు ఉడికించండి.
-అంతే మలబార్ చికెన్ బిర్యానీ రెడీ. పదిహేను నిమిషాలు చల్లారనిచ్చి, మూత తెరిచి కలిపి వేడివేడిగా వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
