Latest Updates
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. ధర ఎంతో తెలుసా..? -
గంటల సమయం పట్టకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేసుకోండిలా! -
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్ -
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి! -
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. -
బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా.. -
చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే.. -
శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు! -
చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన నువ్వుల పట్టీ..ఇంట్లోనే ఇలా చేసుకోండి! -
ఒక్క లిప్ కిస్ ప్లీజ్.. విదేశీ యూట్యూబర్ తో మనోడు వెకిలి చేష్టలు, వీడియో చూడండి..
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే..విటమిన్ C, ప్రోటీన్లు మెండుగా ఉండే ఉసిరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలంటే..
దక్షిణ భారత వంటకాల్లో పొడి అంటేనే నోరూరిపోతుంది. రకరకాలుగా చేసే ఈ పొడులు మన భోజనానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉసిరి, కరివేపాకుతో చేసే పొడి చాలా అనువైనది. శీతాకాలంలో లభించే ఉసిరిలో విటమిన్ C పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరంగా ఉండే కరివేపాకులో పోషకాలు మెండుగా ఉంటాయి.
ఈ పొడిలో ప్రోటీన్లు అధికంగా ఉండే వేరుశెనగలు కూడా వాడటం వల్ల చలికాలంలో శరీరానికి కావలసిన బలం లభిస్తుంది. ఈ పొడిని తయారు చేయడం ఎలా, నిల్వ చేయడం ఎలాగో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉసిరికాయలు: 200 గ్రాములు
కరివేపాకు: 100 గ్రాములు
వేరుశెనగలు: అర కప్పు
శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు: 8 నుండి 10
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 8 నుండి 10
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి!
తయారీ విధానం
-ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసేసి సన్నగా తురుముకోవాలి. ఆ తురుములో తేమ లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. సమయం ఉంటే ఒకటి రెండు రోజులు ఎండలో ఆరబెట్టవచ్చు. వెంటనే ఆరబెట్టడానికి ఓవెన్ ను కూడా ఉపయోగించవచ్చు.
-తర్వాత కరివేపాకును కడిగి పూర్తిగా ఆరనివ్వాలి.
-కరివేపాకు ఆరిన తర్వాత ఒక బాండీలో కొద్దిగా నూనె వేడి చేసి, ఆకులు కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, శనగపప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, వేరుశెనగలు వేయాలి. వేరుశెనగలతో సహా అన్ని మసాలా దినుసులను మంచి సువాసన వచ్చి, బంగారు రంగులోకి మారే వరకు వేయించి చల్లారనివ్వాలి.
-వేయించిన దినుసులు చల్లారిన తర్వాత, వాటితో పాటు ఎండిన ఉసిరి తురుము, వేయించిన కరివేపాకు, రుచికి తగినంత ఉప్పును గ్రైండర్ లో వేయాలి. పల్స్ మోడ్ లో అంటే మధ్యమధ్యలో ఆపుతూ ముతక పొడిగా మారే వరకు రుబ్బాలి.
-రుబ్బిన తర్వాత తయారుచేసిన పొడిని పూర్తిగా చల్లారనిచ్చి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 4 వారాల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
-వేడివేడి అన్నంలో దేశీ నెయ్యి వేసుకుని తింటే దీని రుచి అమోఘంగా ఉంటుంది. అంతేకాకుండా దోసె, ఇడ్లీ, పరాఠా, పప్పు-అన్నం లేదా కూరగాయల రోటీలతో కూడా దీనిని వడ్డించుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ దాకా వరకు ఏ సమయంలోనైనా దీనిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
