Latest Updates
-
గంటల సమయం పట్టకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే రుచికరమైన నిమ్మకాయ పచ్చడి చేసుకోండిలా! -
రైలులో థర్డ్ ఏసీ ప్రయాణంపై కొడుకు ఫిర్యాదు.. జనరల్ కంపార్ట్మెంట్ కి తీసుకెళ్లిన తండ్రి.. వీడియో వైరల్ -
మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి! -
కేవలం వారం రోజుల్లో బరువు తగ్గడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. -
బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా.. -
చలికాలంలో జలుబు, దగ్గు దరిచేరనివ్వని..ఇమ్యూనిటీని రెట్టింపు చేసే ఉసిరి చ్యవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలంటే.. -
శీతాకాలపు పార్టీల్లో అతిగా తిని, తాగుతున్నారా? తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ ముప్పు! -
చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన నువ్వుల పట్టీ..ఇంట్లోనే ఇలా చేసుకోండి! -
ఒక్క లిప్ కిస్ ప్లీజ్.. విదేశీ యూట్యూబర్ తో మనోడు వెకిలి చేష్టలు, వీడియో చూడండి.. -
రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ.. ఇడ్లీ, దోశ, చపాతీలకు బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఇదే.. ధర ఎంతో తెలుసా..?
ఎంతటి అద్భుతమైన వంటకమైనా అందులో చిటికెడు ఉప్పు పడకపోతే దాని రుచి అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉండే సాధారణ ఉప్పును మనం మార్కెట్లో రూ.20 నుండి రూ.50 మధ్యలో కొనుగోలు చేస్తాము. కానీ మనం సామాన్యంగా భావించే ఇదే ఉప్పు మన ఊహకు కూడా అందని ధరకు అమ్ముడవుతోందని చెబితే మీరు నమ్మగలరా?
కొరియాలో ఒక అరుదైన ఉప్పు ఉంది. జుక్యోమ్ లేదా కొరియన్ వెదురు ఉప్పు అని పిలువబడే దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పుగా అభివర్ణిస్తారు. ఉత్పత్తి చేయడం ఎంతో కష్టమైన, సుదీర్ఘ సంప్రదాయం కలిగిన ఈ ఉప్పు ధర మన నెలవారీ బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

అగ్నిలో పుట్టిన సంప్రదాయం
ఈ వెదురు ఉప్పు తయారీ వెనుక 10వ శతాబ్దం నాటి ఎంతో శ్రమతో కూడిన సంప్రదాయ ప్రక్రియ దాగి ఉంది. ముందుగా మందపాటి వెదురు కర్రలలో సహజమైన సముద్రపు ఉప్పును నింపి, ఖనిజాలు సమృద్ధిగా ఉండే బంకమట్టితో పూత పూస్తారు. ఆ తర్వాత వాటిని కట్టెల నిప్పు మీద కాల్చుతారు. ఇలా ఏకంగా తొమ్మిదో సారి వరకు పదేపదే కాల్చడంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతిసారి కాల్చినప్పుడూ ఉప్పులోని బూడిద రంగు మలినాలు తొలగిపోయి, సరికొత్త ఖనిజాలు చేరుతాయి. తద్వారా ఉప్పు పొగ రంగును సంతరించుకుని, చివరకు అద్భుతమైన ఊదా రంగులోకి మారుతుంది.

ఎందుకంత ఖరీదైనది?
ఇతర ఉప్పుల కంటే ఇది ఖరీదైనది కావడానికి ప్రధాన కారణం దీని తయారీకి పట్టే సుదీర్ఘ సమయం, దానిలోని సూక్ష్మత. తొమ్మిది సార్లు వేయించడం వల్ల ఇది చాలా స్వచ్ఛమైనదని, తెల్ల ఉప్పు లేదా హిమాలయ ఉప్పు కంటే అధిక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర కిలోగ్రాముకు సుమారు 347.37 డాలర్లు కాగా, భారతదేశంలో సుమారు 30,000 రూపాయల వరకు పలుకుతుంది.
ఔషధ గుణాలు
కొరియన్ వైద్యంలో వెదురు ఉప్పును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. కేవలం రుచినిచ్చే పదార్థంగానే కాకుండా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సాధనంగా దీనిని పరిగణిస్తారు. మట్టి, వెదురుతో తయారవ్వడం వల్ల ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఉప్పు శరీరంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయ పనితీరును,జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసిస్తారు.
దీనిని ఎలా ఉపయోగించాలి?
సాధారణ ఉప్పులా దీనిని రోజువారీ వంటల్లో ఎక్కువగా వాడకూడదు. బదులుగా, వంట చివరలో రుచి కోసం చిటికెడు చొప్పున లేదా కొన్ని సహజ వైద్య పద్ధతులలో ఔషధంగా చాలా తక్కువ పరిమాణంలో దీనిని ఉపయోగిస్తారు.



Click it and Unblock the Notifications
