Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
బక్రీద్ స్పెషల్: పాతకాలం నాటి పద్ధతిలో మసాలా మటన్ ఫ్రై..ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే!
మీరు స్పైసీగా, ఘాటుగా ఉండే నాన్ వెజ్ వంటకాలను ఇష్టపడే వారైతే ఇంట్లో తయారుచేసిన అద్భుతమైన మసాలాతో చేసే మసాలా మటన్ ఫ్రై కచ్చితంగా రుచి చూడాల్సిందే. ఇది ఏవో సాదాసీదా పొడులు చల్లి చేసే సాధారణ మటన్ ఫ్రై కాదు, మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి సంప్రదాయ పద్ధతిలో అప్పటికప్పుడు వేయించి దంచిన మసాలా పొడితో చేసే ఒక అద్భుతమైన వంటకం. రెడీమేడ్ మసాలాలకు భిన్నంగా, అప్పటికప్పుడు తయారుచేసుకునే ఈ మసాలా వల్ల వంటగది మొత్తం కమ్మటి సువాసనతో నిండిపోతుంది. మటన్ ముక్కలు లోపల అత్యంత జ్యూసీగా ఉంటూనే, బయట వైపు మసాలా అంతా పట్టి పర్ఫెక్ట్గా రోస్ట్ అవుతాయి. బక్రీద్ సందర్భంగా మీ ఇంట్లోనే ఈజీగా మసాలా మటన్ ఫ్రై ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మసాలా మటన్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
గసగసాలు - 1 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి- 3 టేబుల్ స్పూన్లు
ధనియాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు - అర టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
యాలకులు - 2
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 4
మటన్- అర కిలో
ఉప్పు-1 టీస్పూన్
మసాలా మటన్ ఫ్రై తయారీ విధానం
-ఒక మందపాటి పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో గసగసాలు, ఎండుకొబ్బరి, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. వీటిని సన్నని మంటపై మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రెష్ మసాలా వల్లే వంటకానికి అసలైన ప్రాణం వస్తుంది.
-ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన అర కిలో మటన్ వేయాలి. అందులోనే ఒకటిన్నర టీస్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ ఉప్పు వేసి ముక్కలన్నింటికీ పట్టేలా బాగా కలపాలి. ఆ తర్వాత ముప్పావు గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టాలి. మటన్ లేతగా, లోపల జ్యూసీగా ఉడకడానికి సుమారు 7 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించుకోవాలి. ప్రెషర్ వాటంతట అదే పోయేంతవరకు ఆగి మూత తీయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక 2 కరివేపాకు రెబ్బలు, 2 పచ్చిమిర్చి (చీలికలు), సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఓపికగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, ముందుగా కుక్కర్ లో ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను పాన్ లో వేయాలి. ఇప్పుడు మనం దంచి సిద్ధం చేసుకున్న స్పెషల్ మసాలా పొడిని ఇందులో వేసి బాగా కలపాలి.
-కూరకు ఆకర్షణీయమైన రంగు రావడానికి అందులో 1 టీస్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి.మంటను మీడియంలో పెట్టి, మటన్ ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా నిదానంగా రోస్ట్ చేయాలి. కూరలో ఉన్న నీరంతా ఇగిరిపోయి, నూనె పైకి తేలే వరకు వేయించాలి.
-మటన్ ముక్కలు పర్ఫెక్ట్ గా రోస్ట్ అయ్యాక, చివరగా మీ రుచికి తగినట్లుగా ఉప్పు, కారం సరిచూసుకుని అడ్జస్ట్ చేసుకోండి.
-అంతే ఘుమఘుమలాడే స్పైసీ మసాలా మటన్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నం, చపాతీ లేదా రోటీలోకైనా ఈ మటన్ ఫ్రై అద్భుతమైన కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications