Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
బక్రీద్ స్పెషల్.. అదిరిపోయే లక్నోవి మటన్ కుర్మా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
దేశవ్యాప్తంగా ముస్లింలు ఇవాళ బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున జంతుబలి ఇవ్వడం ఆనవాయితీ. బంధువులు, స్నేహితులతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అతిథులకు రకరకాల వంటకాలు వడ్డించినా, మటన్ కుర్మా లేకపోతే ఆ పండుగ భోజనానికి అసలైన కళ రాదు. మనదేశంలో బెస్ట్ మటన్ కుర్మా దొరికే ప్లేస్ లలో హైదరాబాద్, ఢిల్లీ, లక్నో నగరాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. ప్రముఖ చెఫ్ రణ్‌వీర్ బ్రార్ తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసిన విధంగా, మీ ఇంట్లోనే ఈ బక్రీద్ కి అద్భుతమైన లక్నోవి మటన్ కుర్మాని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

లక్నోవి మటన్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
-ఒకటిన్నర కప్పు గిలకొట్టిన పెరుగు
-1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
-1 టేబుల్ స్పూన్ కారం
-అర టీస్పూన్ పసుపు
-అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి
-పావు టీస్పూన్ జీలకర్ర పొడి.
-5-6 నల్ల యాలకులు
-4-5 పచ్చి యాలకులు
-అర టేబుల్ స్పూన్ మిరియాలు
-1 టేబుల్ స్పూన్ ధనియాలు
-5-6 లవంగాలు
-దాల్చిన చెక్క ముక్క
-2 బిర్యానీ ఆకులు
-1 జాపత్రి
-అర టీస్పూన్ జీలకర్ర
-ఉప్పు
-750 గ్రాముల మటన్
-2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి
-2-3 టేబుల్ స్పూన్ల నూనె
-4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు
-అర కప్పు కుంకుమపువ్వు నీళ్లు
-2 టీస్పూన్ల కెవ్రా వాటర్
-2 టీస్పూన్ల జీడిపప్పు పేస్ట్
-కొత్తిమీర
లక్నోవి మటన్ కుర్మా తయారీ విధానం
-ఒక పాన్ లో నల్ల యాలకులు, పచ్చి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకులు, జాపత్రి, జీలకర్ర వేసి సన్నని మంటపై కమ్మటి వాసన వచ్చేలా వేయించి, మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి.
-ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
-ఒక మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె వేడి చేయాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల యాలకులు వేసి వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి 4 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులో వేసి, నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై వేయించాలి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి మటన్ ముక్కలు మెత్తగా, జ్యూసీగా ఉడికే వరకు దమ్ చేయాలి.
-ముక్క ఉడికాక జీడిపప్పు పేస్ట్, కుంకుమపువ్వు నీళ్లు, కెవ్రా వాటర్ వేసి బాగా కలపాలి.
-చివరగా ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే. నోరూరించే లక్నోవి మటన్ కుర్మా రెడీ.
-దీనిని వేడి వేడి నాన్, ఖమీరీ రోటీ లేదా బగారా రైస్‌తో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
