Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్‌లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
ఇస్లామాబాద్ ఫేమస్ చాప్లీ కబాబ్..ఇలా చేస్తే ఇంటర్నేషనల్ టేస్ట్!
మీరు పక్కా నాన్ వెజ్ ప్రియులా? ఎప్పుడూ తినే చికెన్, మటన్ వంటకాలకు భిన్నంగా నోటికి కారంగా, కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే కొత్త వంటకాన్ని రుచి చూడాలని అనుకుంటున్నారా? అయితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఫేమస్ చాప్లీ కబాబ్ ట్రై చేయాల్సిందే.
సాధారణంగా ఇలాంటి అద్భుతమైన కబాబ్ లు కేవలం రెస్టారెంట్లలో మాత్రమే దొరుకుతాయని, ఇంట్లో చేయడం కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన కొలతలు, చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. మీ వంటగదిలోనే ఈ అంతర్జాతీయ రుచిని చాలా సులభంగా ఆస్వాదించవచ్చు.

సాధారణ కబాబ్ లు మందంగా, గుండ్రంగా ఉంటే.. చాప్లీ కబాబ్ లు మాత్రం ఫ్లాట్ గా, పలుచగా, కాస్త పెద్ద పరిమాణంలో ఉంటాయి. పెనం మీద వేయించినప్పుడు ఇవి పైన కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, రసభరితంగా తయారవుతాయి. ఇస్లామాబాద్ ఫేమస్ చాప్లీ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
చాప్లీ కబాబ్ తయారీకి కావలసిన పదార్థాలు
మటన్ కీమా (సన్నగా కొట్టినది) - 500 గ్రాములు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
టమాటో - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2 లేదా 3 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
దానిమ్మ గింజల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం, ఉప్పు -తగినంత
గరం మసాలా - అర టీస్పూన్
శనగపిండి లేదా కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
గుడ్డు - 1
నూనె - వేయించడానికి సరిపడా
చాప్లీ కబాబ్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో మటన్ కీమా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, దానిమ్మ గింజల పొడిని వేసి మిశ్రమాన్ని బాగా మర్దన చేయండి.
-కబాబ్ లు నూనెలో వేయగానే విడిపోకుండా ఉండటానికి శనగపిండి లేదా కార్న్‌ఫ్లోర్, గుడ్డు సొనను వేసి బాగా కలపండి. మసాలాలన్నీ కీమాకు పట్టేలా ఈ మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేడి చేయండి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని, కీమా మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకుని అరచేతిలో పెట్టి పలుచని, వెడల్పాటి కబాబ్ ల ఆకారంలో వత్తుకోవాలి.
-వీటిని వేడి నూనెలో వేసి, రెండు వైపులా మంచి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడే వరకు మీడియం మంటపై వేయించుకోవాలి. మంట మరీ ఎక్కువగా ఉంటే లోపల ఉడకదు, కాబట్టి కాస్త ఓపికగా ఫ్రై చేసుకోవాలి.
-అంతే.. ఘుమఘుమలాడే ఇస్లామాబాద్ చాప్లీ కబాబ్స్ రెడీ. వేడివేడి కబాబ్ ల పైన కొద్దిగా నిమ్మరసం పిండుకుని, పక్కన పుదీనా గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ చక్రాలతో కలిపి తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications