Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే క్యాబేజీ పల్లీ రైస్.. లంచ్ బాక్స్ లోకి ఈజీగా.. అమృతం టేస్ట్!
రోజూ పొద్దున్నే లేవగానే లంచ్ బాక్స్ లోకి ఏ కూర చేయాలి, కొత్తగా ఏ వెరైటీ చేయాలి అనే ఆలోచన రావడం సహజం. అయితే మీరు తక్కువ టైంలో, ఎంతో రుచికరమైన లంచ్ రెడీ చేయాలనుకుంటే, క్యాబేజీ పల్లీ రైస్ మీకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది తయారు చేయడం ఎంత సులభమో, రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్లో దొరికే ఫ్రైడ్ రైస్ తిన్న అనుభూతిని ఇస్తుంది.

దీనిలో ఉన్న మరో గొప్ప ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి ఏవీ వాడాల్సిన అవసరం లేదు. అయినా సరే దీని రుచి అమోఘంగా ఉంటుంది. నోరూరించే క్యాబేజీ పల్లీ రైస్ ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇక్కడ చూడండి.
క్యాబేజీ పల్లీ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె లేదా నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
సోంపు- అర టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
సన్నగా తరిగిన క్యాబేజీ - 1 కప్పు
సన్నగా తరిగిన క్యారెట్ - పావు కప్పు
ఉడికించిన పల్లీలు - అర కప్పు
ఉప్పు - సరిపడా
మిరియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
వండి పెట్టుకున్న అన్నం - 2 కప్పులు
కొత్తిమీర - కొద్దిగా
క్యాబేజీ పల్లీ రైస్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వాడితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, సోంపు వేసి చిటపటలాడనివ్వండి. సోంపు ఈ రైస్ కు అద్భుతమైన సువాసనను ఇస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసి కాస్త వేగనివ్వండి.
-పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్ తురుము వేయండి. ఇప్పుడు ఈ రైస్ కు అసలైన బలాన్ని ఇచ్చే ఉడికించిన పల్లీలను వేయండి. పల్లీలు మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను, ప్రోటీన్లను పుష్కలంగా అందిస్తాయి. పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
-కూరగాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులో ముప్పావు టీస్పూన్ ఉప్పు, ఘాటైన మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి. కూరగాయలు కాస్త దగ్గరపడే వరకు, వాటి పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు సన్నని మంట మీద వేయించండి.
-కూరగాయల మిశ్రమం వేగి, మసాలా వాసన గుమగుమలాడుతున్నప్పుడు, ముందుగా వండి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేయండి. మసాలా అంతా అన్నం మెతుకులకు పట్టేలా నిదానంగా కలపండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడివేడి క్యాబేజీ పల్లీ రైస్ రెడీ. దీన్ని చల్లని పెరుగు రైతా లేదా మీకు ఇష్టమైన కర్రీతో కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
