Latest Updates
-
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.!
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
మీ ఇంట్లో క్యారెట్ ఉంటే.. ఫ్రై చేయడం లేదా సాంబార్, కుర్మాలో వేయడం మాత్రమే చేస్తుంటారా? రోజూ అవే వంటకాలు తిని విసుగొచ్చేసి, కొంచెం కొత్తగా, రుచిగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తోందా? అయితే క్యారెట్ ఘీ రోస్ట్ ట్రై చేయండి. సాధారణంగా మనం పనీర్ ఘీ రోస్ట్ లేదా మష్రూమ్ ఘీ రోస్ట్ గురించి వినుంటాం. కానీ ఒకసారి క్యారెట్ తో ఘీ రోస్ట్ చేసి చూడండి.. దీని రుచికి మీరు ఫిదా అవ్వడం ఖాయం.
శాకాహారులు, పండుగ రోజుల్లో, పవిత్ర మాసాల్లో మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. వేడి వేడి చపాతీ, రోటీ లేదా నాన్‌లోకి ఈ క్యారెట్ ఘీ రోస్ట్ కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. కమ్మటి నెయ్యి వాసనతో నోరూరించే ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

క్యారెట్ ఘీ రోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు
ఘీ రోస్ట్ మసాలా కోసం
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
సోంపు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
ఎండు మిరపకాయలు - 8 నుండి 10
జీడిపప్పు - 8 నుండి 10
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కశ్మీరీ కారం- 1 టేబుల్ స్పూన్
నీళ్లు - పేస్ట్ చేయడానికి తగినన్ని
కూర తయారీకి కావలసినవి
క్యారెట్లు - 3
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు - 2
కరివేపాకు - 1 గుప్పెడు
ఉప్పు - రుచికి తగినంత
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు!
క్యారెట్ ఘీ రోస్ట్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆవాలు, ఎండు మిరపకాయలు, జీడిపప్పు వేసి సన్నటి మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి, స్టవ్ ఆపేసి వాటిని చల్లారనివ్వండి.
-వేయించిన ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కశ్మీరీ కారం,కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి లేదా పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కరిగాక అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి సుమారు 5 నిమిషాల పాటు దోరగా వేయించండి. నెయ్యిలో వేగిన క్యారెట్లను ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి.
-అదే పాన్ లో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిచేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించండి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను ఉల్లిపాయల మిశ్రమంలో వేయండి. దానికి రుచికి సరిపడా ఉప్పు కూడా కలపండి. మసాలా పచ్చి వాసన పోయి, నెయ్యి పైకి తేలే వరకు సుమారు 3-4 నిమిషాలు బాగా వేయించండి.
-చివరగా నెయ్యిలో ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మసాలా అంతా క్యారెట్లకు పట్టేలా బాగా కలపండి. మూతపెట్టి సన్నటి మంటపై మరో 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే క్యారెట్ ఘీ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
