Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
సంక్రాంతి స్పెషల్ షుగర్ ఫ్రీ నువ్వుల లడ్డు..ఆరోగ్యానికి రెట్టింపు బెనిఫిట్..తయారీ చాలా ఈజీ
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఇంటి ముందు రంగుల ముగ్గులు, గాలిపటాల సందడి, ఆపై నోరూరించే పిండివంటలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ పండుగలో నువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శతాబ్దాలుగా మన పూర్వీకులు చలికాలంలో నువ్వుల లడ్డులను తినే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
కేవలం రుచి కోసమే కాకుండా, శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా లడ్డులంటే చక్కెర పాకంతో చేస్తారని, బరువు పెరుగుతామని లేదా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలామంది భయపడుతుంటారు.

కానీ ఈ సంక్రాంతికి మీరు ఆ భయాన్ని పక్కన పెట్టి షుగర్ ఫ్రీ నువ్వుల లడ్డు తయారుచేసుకోండి. ఇందులో చక్కెర అస్సలు వాడము. కేవలం సహజమైన తీపినిచ్చే బెల్లం లేదా ఖర్జూరంతో వీటిని తయారు చేస్తాం. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు, డైటింగ్ చేసేవారికి, చిన్నపిల్లలకు అద్భుతమైన స్వీట్. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన లడ్డును ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
తెల్ల నువ్వులు: 1 కప్పు
బెల్లం తురుము లేదా ఖర్జూర పేస్ట్: ముప్పావు కప్పు
నెయ్యి: 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి: అర టీస్పూన్
వేరుశెనగ గుళ్లు: 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో తెల్ల నువ్వులు వేసి, మంటను సిమ్ లో ఉంచి దోరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడుతూ, లేత బంగారు రంగులోకి మారి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.
-వేయించిన నువ్వులను ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా పొడి చేసుకోవాలి.
-అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు తురిమిన బెల్లం లేదా గింజలు తీసిన ఖర్జూర పేస్ట్ వేయండి. మంటను తక్కువలో ఉంచి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపండి. (ఖర్జూరం వాడుతుంటే అది మెత్తగా అయ్యేవరకు వేడి చేయాలి). ఇది తీగ పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే చాలు.
-బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల పొడి, కచ్చాపచ్చాగా దంచిన వేరుశెనగ పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. బెల్లం లేదా ఖర్జూర మిశ్రమం నువ్వుల పొడికి బాగా పట్టేలా చూడాలి.
-మిశ్రమం కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గుండ్రని లడ్డులా చుట్టుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డులు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 10-15 రోజుల పాటు తాజాగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications