Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.!
ఇటీవలి కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఆహారపు అలవాట్లలో మార్పులు, జీవనశైలి సరిగా లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఇలా చాలా కారణాల వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఒత్తిడి కూడా ఇందుకు కారణమవుతోంది. ఈ క్రమంలో మీరు ఈ ఒక్కటి మానేస్తే నెలరోజుల్లోనే బరువులో తేడా కనిపిస్తుందని డైటీషియన్స్ చెబుతున్నారు.

జంక్ ఫుడ్, పానీయాలు, స్వీట్లలో ఎక్కువగా చక్కెర ఉపయోగిస్తారు. అయితే చక్కెర ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదో తెలిసిందే. అందుకే దీనిని తెల్ల విషంగా పిలుస్తారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర తీసుకుంటే ఆ సమస్య మరింత ఎక్కువగా అవుతుందని డైటీషియన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ బాధితులు అధిక బరువుతోనూ బాధపడుతుంటారు. మీరు రోజూ చక్కెర తీసుకున్నట్లయితే డయాబెటిస్-2 ప్రమాదం పెరుగుతుంది. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్ బరువును మరింతగా పెంచి షుగర్ లెవెల్స్‌ను నియంత్రించలేదు. ఈ క్రమంలో ఒక నెల రోజులపాటు చక్కెర లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో గణినీయమైన మార్పులు జరిగి బరువు తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అదెలా సాధ్యం.. ఇక్కడ చూద్దాం..
రోజువారీ జీవితం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం చాలా మందికి సాధ్యం కాదు. ఏదో ఒక సందర్భంలో చక్కెర పదార్థాలు తినాల్సి వస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్‌కి అలవాటు పడినవారు చక్కెర పానీయాలు, స్వీట్లు, ప్యాకేజ్‌డ్ స్నాక్స్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారు చక్కెర వినియోగం గురించి తప్పనిసరిగా ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కూల్ డ్రింక్స్, జ్యూస్‌లు, ప్రాసెస్‌డ్ ఫుడ్‌లో ఎక్కువగా చక్కెర వాడటం ద్వారా ఇది శరీరానికి ఎక్కువగా కేలరీలను అందిస్తుంది. దీని ద్వారా కడుపు నిండిన అనుభూతి కలగకపోవడంతో మరింత తింటూ పోతారు. దీనివల్ల పొట్ట పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం జరుగుతాయి. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లు, కాఫీ, టీ డెజర్ట్‌ల వంటి వాటిలో కూడా చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల కేలరీల వినియోగం పెరిగి అదుపు లేకుండా తినడం, తాగడం చేస్తారు.
అధిక బరువు, డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు నెల రోజుల పాటు చక్కెర మానేయడం వల్ల శారీరకంగా, మానసికంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు ఉబ్బరం తగ్గడంతో గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం మెరుగుపడి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దీంతో క్రమంగా బరువు తగ్గి, రక్తంలో చక్కెర స్థాయిలనూ అదుపులో ఉంచుతుంది. 30 రోజుల పాటు మీరు చక్కెరకు దూరంగా ఉంటే 2.5 కిలోల నుంచి 3 కి.గ్రా వరకు బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. బరువు తగ్గితే క్రమంగా జీవక్రియ మెరుగుపడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నెల రోజులు చక్కెర మానేయడంతో పాటు వ్యాయామం, సమతుల్య ఆహారం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, పుష్కలంగా నీరు తాగడం ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు. సత్ఫలితాలు కనిపిస్తే ఇదే పద్ధతి ఫాలో అవ్వడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
