పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా

Posted By:

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా కరకరలాడే స్నాక్స్ తినాలనిపించడం సహజం. అలాంటి సమయాల్లో వెంటనే గుర్తుకు వచ్చేది బజ్జీలు లేదా వడలు. అయితే రెగ్యులర్ గా చేసుకునే ఉల్లిపాయ పకోడీ, ఆలుగడ్డ బజ్జీలకు భిన్నంగా కొద్దిగా వెరైటీగా, ఆరోగ్యకరంగా ఆలోచిస్తే మనకు దొరికే బెస్ట్ ఆప్షన్ ఎగ్ వడ. సాయంత్రం స్నాక్ గా అయినా లేదా పప్పుచారులో నంజుకొని తినడానికి కూడా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Crispy Egg Vada in 10 Minutes The Ultimate Snack for Rainy Days Recipe in Telugu

కేవలం 10 నిమిషాల వ్యవధిలో, ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతోనే ఎగ్ వడను అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. అతిథులు అకస్మాత్తుగా ఇంటికి వచ్చినప్పుడు కేవలం పది నిమిషాల్లో వాళ్ళకి ఒక స్పెషల్ వంటకం చేసిపెట్టి ఆశ్చర్యపరచడానికి ఈ రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా, బయట నుంచి చూడటానికి చాలా క్రిస్పీగా ఉంటాయి

ఎగ్ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు

-కోడిగుడ్లు
-ఎండుమిరపకాయలు
-పచ్చిమిరపకాయలు
-కారం
-ఉప్పు
-పసుపు
-ఆయిల్
-చాట్ మసాలా
-బ్రెడ్
-గరం మసాలా
-జీలకర్ర
-అల్లం
-ధనియాలు
-ఉల్లిపాయ
-బియ్యం పిండి
-కొత్తిమీర
-కరివేపాకు

సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్!
ఎగ్ వడ తయారీ విదానం

-ముందుగా 4 గుడ్లను బాగా ఉడికించి పొట్టు తీసేసి ఉడికిన గుడ్లను పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక ప్లేట్ లో గ్రేటర్ పెట్టుకొని ఉడికించిన 4 గుడ్లను సన్నగా తురుముకోవాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 1 టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసి ఈ మొత్తాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఎగ్ తురుములో వేసి కలుపుకోండి. ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ చాట్ మసాలా, అర టీస్పూన్ గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 ఉల్లిపాయ సన్నని ముక్కలు వేసి మొత్తం అన్నీ కలిసేలా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి లేదా శెనగపిండి అయినా వేసి కలుపుకోండి.

-కలిపిన మిశ్రమం పొడి పొడిగా అనిపిస్తే కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్ గా ఉండకూడదు. పిండిముద్ద వచ్చేలా సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి.

-ఇప్పుడు చేతిని తడుపుకొని కలిపిన పిండిని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని వడల్లా వత్తుకోండి.

వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా..

-తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి అందులో పావు టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ కారం వేసి, కొంచెం నీళ్లు పోసి పిండిని జారుడుగా కలుపుకోవాలి.

-ఇప్పుడు తినే బ్రెడ్ లోపలి తెల్లటి భాగాన్ని మిక్సీలో వేసి పొడి పొడిగా చేసుకోండి. ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.

-ఇప్పుడు వత్తుకున్న వడలను గిన్నెలో జారుగా కలిపిన పిండిలో ముంచి తర్వాత ప్లేట్ లో బ్రెడ్ పొడిలో కూడా వేసి అటు ఇటు తిప్పి పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో వడలను వేసి వేయించుకోవాలి. అంతే ఎగ్ వడ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, July 17, 2026, 9:25 [IST]
Desktop Bottom Promotion