Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
చికెన్ లవర్స్ కోసం నెక్స్ట్ లెవెల్ రెసిపీ.. మలేషియన్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సాధారణంగా ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కరకరలాడే
చికెన్ ముక్కలను చూస్తేనే ఎవరికైనా నోరూరిపోతుంది. అయితే ఎప్పుడూ ఒకే
రకమైన ఫ్రైడ్ చికెన్ తిని బోర్ కొట్టిందా? అయితే ఓసారి మలేషియన్
ఫ్రైడ్ చికెన్ ట్రై చేయండి., దీనినే స్థానికంగా అయామ్ గోరెంగ్ అని
కూడా పిలుస్తారు.
ఈ చికెన్ రుచి చూస్తే ఫిదా అయిపోవడం గ్యారెంటీ. మీరు కూడా మీ ఇంట్లో
చికెన్ వండే విధానాన్ని నెక్స్ట్ లెవెల్ కి
తీసుకువెళ్లాలనుకుంటే, ఈ సూపర్ సింపుల్ రెసిపీని కచ్చితంగా ట్రై
చేయాల్సిందే. కరకరలాడే రుచికరమైన అయామ్ గోరెంగ్(మలేషియన్ ఫ్రైడ్
చికెన్)మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మలేషియన్ ఫ్రైడ్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) - 8
పచ్చి పసుపు కొమ్ము - 4 సన్నని ముక్కలు (సుమారు 15 గ్రాములు)
అల్లం - 20 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 20 గ్రాములు
ఘాటైన పచ్చిమిర్చి - 10 నుండి 15 గ్రాములు
నిమ్మగడ్డి- 15 గ్రాములు
నిమ్మ ఆకులు- 2 లేదా 3
బోన్‌లెస్ చికెన్ థై (ఎముకలు లేని చికెన్ తొడ మాంసం) - 500
గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
కర్రీ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
మైదా లేదా గోధుమ పిండి - డ్రెడ్జింగ్ చేయడానికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
మలేషియన్ ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న ఉల్లిపాయలు, పచ్చి పసుపు, అల్లం, వెల్లుల్లి, కారంగా ఉండే పచ్చిమిర్చి, నిమ్మగడ్డి, కాఫిర్ లైమ్ ఆకులు(నిమ్మ ఆకులు) వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి కోర్సు పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ మసాలా పేస్ట్ నుండే ఫ్రైడ్ చికెన్ కు అసలైన రుచి వస్తుంది.
-ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసుకున్న ఎముకలు లేని చికెన్ తొడ మాంసం ముక్కలు వేసుకోండి. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కర్రీ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు పక్కన పెట్టుకుంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్ కు అద్భుతంగా పడతాయి.
-మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని, పొడిగా ఉన్న పిండిలో వేసి అన్ని వైపులా పిండి అంటేలా దొర్లించాలి. ఇలా చేయడం వల్ల చికెన్ పైన మంచి క్రిస్పీ లేయర్ ఏర్పడుతుంది.
-కడాయిలో నూనె వేడి చేసి, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, కోట్ చేసుకున్న చికెన్ ముక్కలను మెల్లగా నూనెలో వేయాలి. ఇవి మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చే వరకు, లోపల మాంసం మెత్తగా ఉడికే వరకు వేయించుకుంటే సరిపోతుంది.
-వేడి వేడిగా, పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే అయామ్ గోరెంగ్(మలేషియన్ ఫ్రైడ్ చికెన్) రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications