Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మన ఇళ్లలో బ్రేక్ ఫాస్ట్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ. ఎప్పుడూ అవే చప్పటి ఇడ్లీలు, రొటీన్ చట్నీలు, సాంబార్ తో తినాలంటే కాస్త బోర్ కొట్టడం సహజం. ఎండాకాలంలో వేడి వేడి ఇడ్లీలను తినాలంటే పెద్దలకు కూడా ఏమాత్రం ఆసక్తి ఉండదు. అందుకే మీ రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ కు కాస్త భిన్నంగా, చల్లచల్లగా, నోరూరించేలా సూపర్ టేస్టీ దహీ ఇడ్లీ ట్రై చేయండి.
ఈ దహీ ఇడ్లీలు చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో.. రుచిలో కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే చాలు, అలా వెన్నలా కరిగిపోతాయి. సమ్మర్ స్పెషల్ దహీ ఇడ్లీలను మీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
దహీ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కమ్మటి పెరుగు - ఒక లీటర్
రవ్వ ఇడ్లీలు - 12 (చాలా మెత్తగా ఉండాలి)
పంచదార - రెండు చెంచాలు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఆవాలు - రెండు టీస్పూన్లు
జీలకర్ర - ఒక టీస్పూన్
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
ఇంగువ - నాలుగు చిటికెళ్లు
కరివేపాకు - కొద్దిగా
జీడిపప్పు - కొద్దిగా (గార్నిష్ కోసం)
దానిమ్మ గింజలు - అర కప్పు
దహీ ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో లీటర్ పెరుగును తీసుకుని, ఎక్కడా ఉండలు లేకుండా బాగా చిలకాలి. పెరుగు మరీ గట్టిగా, చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. పెరుగు కాస్త జారుడుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, రెండు చెంచాల చక్కెర వేసి స్మూత్ క్రీమ్ లా మారే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పెరుగు గిన్నెపై మూతపెట్టి కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేశాక అందులో జీడిపప్పులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. చివరగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి సన్నని మంటపై అర నిమిషం పాటు వేయించి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మెత్తటి రవ్వ ఇడ్లీలను పేర్చాలి. ఒకవేళ ఇడ్లీలు చల్లారిపోయి గట్టిగా ఉంటే, వాటిపై కాస్త నీళ్లు చల్లాలి.
-బౌల్ లో ఇడ్లీలు తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచిన చల్లటి పెరుగు మిశ్రమాన్ని ఇడ్లీలన్నీ పూర్తిగా మునిగిపోయేలా పోయాలి. ఆ తర్వాత దీనిపై ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపును సమంగా విస్తరించాలి. చివరగా ఎర్రటి దానిమ్మ గింజలు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి.
-అంతే సూపర్ టేస్టీ అండ్ కూల్ దహీ ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












