Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం!
బీరులో ఆల్కహాల్ చాలా తక్కువే కదా, ఇది తాగితే శరీరానికి పెద్దగా ఏమీ కాదులే.. చాలా మంది మందుబాబులు, యువత తరచుగా అనుకునే మాట ఇది. పార్టీలు జరిగినా, వేసవి కాలం వచ్చినా బీరు సురక్షితమైన పానీయం అనే భ్రమలో చాలా మంది మునిగిపోతుంటారు.
కానీ ఇది ఎంత పెద్ద అపోహో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తక్కువ మోతాదులో బీరు తాగితే హానికరం కాదని నమ్మడం ఒక ప్రాణాంతకమైన పొరపాటు.ః

ఆల్కహాల్ శాతం - ఒక అపోహ
సాధారణంగా బీరులో 4 నుండి 5 శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుందని, విస్కీ లేదా రమ్ లాగా ఇది శరీరాన్ని పాడుచేయదని కొందరు వాదిస్తుంటారు. చాలామంది ప్రతిరోజూ ఒకటి లేదా రెండు డబ్బాల బీరు తాగుతూ, తమకు ఏమీ కాదని ధీమాగా ఉంటారు.
అయితే మార్కెట్లో దొరికే కొన్ని బ్రాండ్ల బీర్లలో వైన్ తో సమానంగా ఆల్కహాల్ ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. అసలు ఎంత బీరు తాగడం సురక్షితం అనే ప్రశ్నకు నిపుణులు చెప్పే ఒకే ఒక్క సమాధానం.. సురక్షితమైన మోతాదు అంటూ ఏదీ లేదు.
కాలేయంపై నిశ్శబ్ద దాడి
మనం తీసుకున్న ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అది నేరుగా కాలేయానికి చేరుకుంటుంది. ఆల్కహాల్ ను జీర్ణించే (జీవక్రియ) క్రమంలో మన కాలేయంలోని కొన్ని కణాలు చనిపోతాయి. అయితే చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలను ఉత్పత్తి చేసుకునే అద్భుతమైన సామర్థ్యం కాలేయానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది.
కానీ మనం నిరంతరం బీరు లేదా మద్యం తాగుతూ ఉంటే కాలేయం కొత్త కణాలను పునరుత్పత్తి చేసే శక్తిని క్రమంగా కోల్పోతుంది. దీని ఫలితంగా కాలేయం తీవ్రంగా దెబ్బతిని లివర్ సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
షుగర్, ఉదర సంబంధిత సమస్యలు
ఇప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారు బీరుకు ఆమడదూరంలో ఉండాలి, లేదంటే ఇది వారి పరిస్థితిని మరింత విషమింపజేస్తుంది. ఇక మధుమేహం (డయాబెటిస్) వ్యాధిగ్రస్తులు ఎక్కువగా బీరు తాగడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి నియంత్రణ తప్పుతాయి. దీనికి తోడు కడుపులో గ్యాస్, అల్సర్ వంటి జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టంగా ఏం చెబుతోందంటే.. మద్యం ఒక్క చుక్క తాగినా అది శరీరానికి సురక్షితం కాదు. వైన్ అయినా, బీరు అయినా అందులో ఉండే ఆల్కహాల్ ను వైద్య పరిభాషలో ఒక విషపూరితమైన పదార్థం గానే పరిగణిస్తారు.
అంతేకాదు, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఆల్కహాల్ ను ఏకంగా గ్రూప్-1 కార్సినోజెన్ గా వర్గీకరించింది. అంటే పొగాకు, రేడియేషన్ లాగా ఇది కూడా నేరుగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే పదార్థమే అని స్పష్టం చేసింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
