Latest Updates
-
గ్రహాల అనుకూలతతో ఈరోజు ఈ రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..అదృష్టం మీ వెంటే! -
ఆయుష్మాన్ సర్వార్థ సిద్ధి యోగం: ఈరోజు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అదృష్టం మీ తలుపు తడుతోంది! -
ఈరోజు అశ్విని నక్షత్రం ప్రభావం ఎలా ఉంది? కొత్త పనులు మొదలుపెట్టే ముందు ఈ ముహూర్తాలు చూశారా? -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. అదృష్టం మీదే! -
వృషభం, తుల, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 15 మే 2026 -
బట్టతల నాన్న,తాత వల్ల వస్తుందా? అమ్మ వల్లా? అసలు విషయం తెలిస్తే అవునా,నిజమా అనాల్సిందే! -
స్వైపింగ్ చేసి విసిగిపోయారా? బంబుల్ డేటింగ్లో రాబోతున్న ఈ మార్పులు మీ లైఫ్ మార్చేయవచ్చు! -
ఆన్ లైన్ ఆర్డర్స్ వద్దు.. కరకరలాడే జ్యూసీ కొరియన్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి -
మీరు ఎంత కాలం బతుకుతారో..30 సెకన్ల ఈ కుర్చీ టెస్ట్ తో తెలుసుకోవచ్చు! -
నోరూరించే మామిడికాయ తాలింపు అన్నం..అదిరిపోతుంది బాసూ కేక కేక అంతే..
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకండి, ఇలా కరకరలాడే వడియాలు చేయండి!
రాత్రి పూట కొద్దిగా అన్నం మిగిలిపోవడం చాలా సాధారణమైన విషయం. ఆ మిగిలిన అన్నాన్ని కొంతమంది పారేస్తుంటారు..మరికొందరు పులిహోర,టమాటో రైస్ వంటివి చేస్తుంటారు. మరికొందరు అయిే మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ కూడా చేస్తుంటారు. అయితే ఇవన్నీ రెగ్యులర్ గా చేసేవే కానీ మీరెప్పుడైనా మిగిలిన అన్నంతో క్రిస్సీ వడియాలు చేశారా?
బయట మార్కెట్లో దొరికే వడియాలు లేదా స్నాక్స్ కొనాలంటే ప్యాకెట్ కు 50 నుండి 100 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా వాటిలో కల్తీ ఉండొచ్చు. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో రూపాయి ఖర్చు లేకుండా మనం ఎంతో రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఆర్థికంగా డబ్బు ఆదా అవుతుంది. మిగిలిన అన్నాన్ని వృథా చేయకుండా, ఎంతో రుచికరమైన, కరకరలాడే అన్నం వడియాలు తయారు చేసుకోవడం మన అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా. ఈ వడియాలు పప్పు, సాంబార్, రసం లాంటి భోజనంలోకి సైడ్ డిష్ గా లేదా టీ టైమ్ స్నాక్ గా చాలా అద్భుతంగా ఉంటాయి. రాత్రి మిగిలిన అన్నంతో సులభంగా, కరకరలాడే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
అన్నం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిగిలిన అన్నం
-జీలకర్ర
-నువ్వులు
-ఉప్పు
-నీళ్లు
-కొత్తిమీర
-కారం
-పసుపు
-టమాటోలు
అన్నం వడియాలు తయారీ విధానం
-1 కప్పు అన్నంకి,1 కప్పు నీళ్లు లెక్కన కొలత ఉండాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 1 కప్పు నీళ్లు పోసి వాటిని మరగబెట్టాలి. తర్వాత అందులో మిగిలిన అన్నం 1 కప్పు వేసి దీనిని కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి.
-అన్నం మెత్తగా ఉడికిన తర్వాత అందులో అరకప్పు టమాటో పేస్ట్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు, పావు టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ నువ్వులు, అర టీస్పూన్ కారం పొడి, అర టీస్పూన్ ఉప్పు, కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి.
-అన్నం మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేయండి. అన్నం మిశ్రమాన్ని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని పాపడాలు లాగా ఒక పాలిథిన్ కవర్ పై ఒత్తుకొని పెట్టుకోండి. వీటిని మంచి ఎండలో 2 రోజులు రెండు వైపులా తిప్పుతూ ఎండబెట్టుకోవాలి.
-రెండు లేదా మూడు రోజుల పాటు ఎండలో పెడితే వడియాలు లోపల తేమ లేకుండా పూర్తిగా ఎండిపోయి గలగలా శబ్దం వస్తాయి. అంతే అన్నం వడియాలు రెడీ.
-బాగా ఎండిన వడియాలను ఒక గాలి చొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. మీకు కావాల్సినప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె వేడి చేసి ఈ వడియాలను డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వేడి నూనెలో వేయగానే ఇవి పువ్వుల్లా విచ్చుకుని, తెల్లగా, కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












