Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
మిగిలిన అన్నంతో క్రిస్పీ దోశ.. 10 నిమిషాల్లో సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు!
సాధారణంగా ప్రతి ఇంట్లో రాత్రుళ్ళు వండుకున్న అన్నం కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నం పారేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. అందుకే ఆ అన్నాన్ని కొందరు తినేస్తే కొందరు కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన దోశలు వేసుకోవచ్చు. ఈ దోశలు క్రిస్పీగా చాలా రుచికరంగా ఉంటాయి. అయితే మిగిలిన అన్నంతో ఏ విధంగా దోశలు వేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మిగిలిన అన్నంతో దోశ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల అన్నం
- ఒక కప్పు ఉప్మా రవ్వ
- ఒక కప్పు పుల్లటి పెరుగు
- అర కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి
- పిండి కలుపుకోవడానికి సరిపడా నీరు
- కొంచెం నూనె
- రుచికి తగినంత ఉప్పు
మిగిలిన అన్నంతో దోశ తయారీ విధానం
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల అన్నం, ఒక కప్పు ఉప్మా రవ్వ, పెరుగు, మైదా పిండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు పిండి బిగుతుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే మధ్య మధ్యలో మిక్సీని ఆపుతూ కొంచెం నీళ్లు చల్లుకుంటూ మెత్తగా పిండిని రుబ్బుకోవాలి.
అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. దోశ వేసుకునేందుకు వీలుగా కొంచెం లూస్‌గా ఈ పిండిని కలుపుకోవాలి. ఆ పిండి దోశ వేసుకునేందుకు వీలుగా లేకపోతే కొంచెం నీళ్లు కలుపుకొని ఆ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత పిండిని బాగా కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక దానిపై కొంచెం నూనె వేసుకొని సగం తరిగిన ఉల్లిపాయతో పెనం మొత్తం నూనె స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని తీసుకొని ఆ పెనంపై కాస్త మందంగానే దోశను వేసుకోవాలి. రెండు వైపులా దోశను కాల్చుకున్నాక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇలా పిండి అయిపోయేంత వరకు అన్ని దోశలు వేసుకుంటే ఎంతో రుచికరమైన దోశ సిద్ధమైపోయినట్లే. ఈ దోశలను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, లేదా పల్లి చట్నీలతో కూడా తినొచ్చు. ఎంతో రుచికరంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
