Latest Updates
-
ఆరు కోట్ల బిజినెస్, రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తకు ఫుడ్ లో విషం.. కన్నకొడుకునూ వదలని కిరాతక తల్లి! -
చలికాలంలో జీర్ణశక్తిని పెంచే క్యారెట్ పచ్చిమిర్చి పచ్చడి..ఇలా చేస్తే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ! -
మెరిసే చర్మం కావాలా? ఇంట్లోనే సబ్బును ఈజీగా తయారు చేసుకోండిలా.. -
మాత్రలు వేసుకున్నా విటమిన్ D లోపం తగ్గడం లేదా? డాక్టర్ సలహా ఇదే! -
చట్నీ కూడా అవసరం లేని అద్భుతమైన టిఫిన్.. పోషకాలు నిండిన ముల్లంగి అటుకుల దోసె ఇంట్లోనే ఇలా చేయండి! -
ఇంటిల్లిపాదీ ఫిదా అయ్యే మినుముల చట్నీ..ఇడ్లీ, దోసెలతోనే కాదు అన్నానికి కూడా పర్ఫెక్ట్! -
ఫుడ్ ప్యాకెట్లపై కొత్త రూల్స్.. FSSAIకి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు -
చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే హై ప్రోటీన్ వేరుశెనగ బెల్లం లడ్డు..ఈజీగా చేసుకోండిలా.. -
భారతదేశపు అతి పొడవైన రైలు జర్నీ ఇదే..కాలు కింద పెట్టకుండానే 12 రాష్ట్రాలను చూడొచ్చు! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే, కీళ్ల నొప్పులు పోగొట్టే మునగాకు డ్రై ఫ్రూట్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
ఎగ్ కీమా మసాలా ఇలా చేస్తే.. 2 చపాతీలు ఎక్కువే తింటారు!
మనలో చాలామంది రాత్రిపూట చపాతీలు లేదా రోటీలు చేసుకున్నప్పుడు వాటికి తోడుగా ఏదైనా ప్రత్యేకమైన సైడ్ డిష్ ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ ఒకే రకమైన గుడ్డు కూర, ఆమ్లెట్ లేదా ఎగ్ బుర్జీ తిని బోర్ కొట్టిందా?
అయితే ఈసారి కాస్త కొత్తగా, నోరూరించే రుచితో ఎగ్ కీమా మసాలా చేయండి. ఈ వంటకం రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.ఎప్పుడూ తినేదానికంటే రెండు చపాతీలు ఎక్కువే లాగించేస్తారు. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కీమా మసాలా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
ఉడికించి తురుమిన గుడ్లు - 4
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన టమాటో - 1
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
పావ్ భాజీ మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
చలికాలంలో జీర్ణశక్తిని పెంచే క్యారెట్ పచ్చిమిర్చి పచ్చడి..ఇలా చేస్తే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ!
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి పాన్ పెట్టుకుని అందులో వెన్న వేయండి. వెన్న పూర్తిగా కరిగిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారేవరకు దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి, అవి పూర్తిగా మెత్తబడి గుజ్జులా మారేవరకు మగ్గనివ్వండి.
-టమాటోలు బాగా ఉడికిన తర్వాత మంటను మీడియంలో ఉంచి అందులో కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, పావ్ భాజీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మసాలాల పచ్చి వాసన పోయేవరకు ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మసాలా మిశ్రమాన్ని బాగా కలిపి, నూనె పైకి తేలి గ్రేవీ చిక్కబడే వరకు సుమారు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి.
-చివరగా ముందుగా ఉడికించి తురుమి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి మసాలా అంతా గుడ్డు తురుముకు పట్టేలా నెమ్మదిగా కలపండి. ఆ తర్వాత మరో 3 నిమిషాలు సన్నని మంటపై ఉడకనివ్వండి.
-దించే ముందు కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆపేయండి.
-అంతే నోరూరించే, ఘుమఘుమలాడే ఎగ్ కీమా మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
