For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గసగసే పాయస రెసిపి : గసగసాల పాయసం చేయటం ఎలా

Posted By: Lekhaka
|

కర్ణాటక రాష్ట్ర సంప్రదాయ స్వీటు వంటకం గసగసే పాయసం. ఇది అన్ని ప్రముఖ పండగలకి, రోజులకీ వండుకుంటారు. దీన్ని గసగసాలు, కొబ్బరి, బెల్లంతో తయారుచేస్తారు.

గసగసాల పాయసం ఎన్నో పోషకవిలువలున్నది మరియు చాలా చలవచేసేది. అందుకే భోజనం తర్వాత తీసుకుంటారు. నోటి పుళ్ళు, నిద్రలేమిని తగ్గించటానికి కూడా దీన్ని తింటారు. ఈ పాయసాన్ని తాగిన వెంటనే నిద్రమత్తు వస్తుంది.

ఖుస్ ఖుస్ ఖీర్ అన్ని పండగలకి చేసుకోదగ్గ సులభమైన స్వీటు పదార్థం. మీకు బెల్లంతో చేసిన స్వీట్లు ఇష్టమైతే, ఈ పాయసం మీ నాలుకకి ఎంతో ఆనందాన్నిస్తుంది. చిత్రాలు, వీడియోల సాయంతో తయారీ విధానం చదివేసి త్వరత్వరగా చేసుకోండి.

గసగసే పాయస రెసిపి । గసగసాల పాయసం తయారీ ఎలా । ఖుస్ ఖుస్ ఖీర్ రెసిపి
గసగసే పాయస రెసిపి । గసగసాల పాయసం తయారీ ఎలా । ఖుస్ ఖుస్ ఖీర్ రెసిపి
Prep Time
5 Mins
Cook Time
20M
Total Time
25 Mins

Recipe By: కావ్యశ్రీ ఎస్

Recipe Type: స్వీట్లు

Serves: 4కి

Ingredients
  • గసగసాలు - 3 చెంచాలు

    బెల్లం - ½ మధ్య సైజు పాత్రలో

    నీరు - అరగ్లాసు

    కొబ్బరి కోరు - 1 కప్పు

    ఏలకులు - 2

    నీరు - పావు కప్పు

How to Prepare
  • 1. గసగసాలను ఒక వేడిచేసిన పెనంలో తీసుకోండి.

    2. అవి కొంచెం బ్రౌన్ రంగులోకి మారేవరకు పొడిగా వేయించండి.

    3. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.

    4. ఈ లోపల ఆ వేడిపెనంలో బెల్లం వేయండి.

    5. పావు కప్పు నీళ్ళు పోసి బాగా కలపండి.

    6. మూతపెట్టి బాగా కరగనివ్వండి.

    7. అదే సమయంలో, గసగసాలను మిక్సీలో వేయండి.

    8. కొబ్బరికోరు,ఏలకులను కూడా వేయండి.

    9. పావుకప్పు నీళ్ళు పోసి మిక్సీని తిప్పి పేస్ట్ లా తయారుచేయండి.

    10. బెల్లం కరిగాక, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.

    11. 2-3 నిమిషాల పాటు మధ్య మంటపైన ఉడకనివ్వండి.

    12. మాడిపోకుండా అప్పుడప్పుడూ కలుపుతూ ఉండండి.

    13. ఉడికాక, వేడివేడిగా వడ్డించండి.

Instructions
  • 1. రుచికావాలంటే పాలను వేసుకోవచ్చు.
  • 2. కొబ్బరితోపాటు గసగసాలను మిక్సీలో రుబ్బుతున్నప్పుడు, నానబెట్టిన బియ్యాన్ని కొంచెం వేస్తే గట్టిగా అవుతుంది.
  • 3. బెల్లం బదులు పంచదార వేయవచ్చు; కానీ పాయసం రుచి మారిపోతుంది.
  • 4. వేయించిన డ్రై ఫ్రూట్లను జతచేయడం చాలా మంచిపద్ధతి. ఇవి మరింత రుచిని తెస్తాయి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 136 కాలరీలు
  • కొవ్వు - 4 గ్రాములు
  • ప్రొటీన్ - 3గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 14 గ్రాములు
  • చక్కెర - 9 గ్రాములు
  • ఐరన్ - 5%

స్టెప్ బై స్టెప్ - గసగసే పాయస తయారీ ఎలా

1. గసగసాలను ఒక వేడిచేసిన పెనంలో తీసుకోండి.

2. అవి కొంచెం బ్రౌన్ రంగులోకి మారేవరకు పొడిగా వేయించండి.

3. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.

4. ఈ లోపల ఆ వేడిపెనంలో బెల్లం వేయండి.

5. పావు కప్పు నీళ్ళు పోసి బాగా కలపండి.

6. మూతపెట్టి బాగా కరగనివ్వండి.

7. అదే సమయంలో, గసగసాలను మిక్సీలో వేయండి.

8. కొబ్బరికోరు,ఏలకులను కూడా వేయండి.

9. పావుకప్పు నీళ్ళు పోసి మిక్సీని తిప్పి పేస్ట్ లా తయారుచేయండి.

10. బెల్లం కరిగాక, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.

11. 2-3 నిమిషాల పాటు మధ్య మంటపైన ఉడకనివ్వండి.

12. మాడిపోకుండా అప్పుడప్పుడూ కలుపుతూ ఉండండి.

13. ఉడికాక, వేడివేడిగా వడ్డించండి.

[ 4.5 of 5 - 35 Users]
English summary

Gasagase Payasa Recipe | How To Make Poppy Seeds Payasam | Khus Khus Kheer Recipe

Gasagase payasa is a traditional sweet of Karnataka that is prepared for all festive occasions. Learn how to make the poppy seeds kheer. Watch the video
Desktop Bottom Promotion