Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
నోరూరించే జామకాయ ఊరగాయ..అన్నం, చపాతీల్లోకి కేక.. 10 నిమిషాల్లోనే చేసుకోండిలా..
తెలుగు వారికి ఊరగాయలంటే ప్రాణం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఆవకాయో లేదా మాగాయో కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. మన ఇళ్లలో సాధారణంగా మామిడికాయ, నిమ్మకాయ, వెల్లుల్లి, టమాటా లేదా పచ్చిమిర్చి వంటి ఊరగాయలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా పండ్లతో, మరీ ముఖ్యంగా జామకాయతో ఊరగాయ పచ్చడిని రుచి చూశారా? జామకాయతో పచ్చడా? అని ఆశ్చర్యపోతున్నారా?

జామకాయలతో చేసే ఊరగాయ తీపి, పులుపు, కారం కలగలిపి అద్భుతమైన రుచిని ఇస్తుంది. మనలో చాలామంది పచ్చి జామకాయపై కాస్త ఉప్పు, కారం చల్లుకుని ఇష్టంగా తింటుంటారు. అదే రుచిని రెట్టింపు చేస్తూ ఊరగాయ రూపంలో చేసుకుంటే భోజనానికి మరింత రుచి వస్తుంది. పైగా దీన్ని తయారు చేయడం చాలా సులభం. మీ వంటగదిలో ఉండే సాధారణ మసాలా దినుసులతో కేవలం కొద్ది నిమిషాల్లోనే దీన్ని సిద్ధం చేసుకోవచ్చు. అన్నం, రోటీ, లేదా చపాతీల్లోకి ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్. నోరూరించే జామకాయ ఊరగాయకు ఏమేం కావాలి? ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
జామకాయ ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు
గట్టిగా ఉండే జామకాయలు: అర కిలో (500 గ్రాములు)
సోంపు గింజలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
మెంతులు: అర టీస్పూన్
నల్ల జీలకర్ర (కలోంజి): అర టీస్పూన్
పసుపు పొడి: 1 టీస్పూన్
కారం లేదా కశ్మీరీ కారం: 1-2 టీస్పూన్లు
ఆవ నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఇంగువ: కొద్దిగా
సాధారణ ఉప్పు: రుచికి సరిపడా
నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్): కొద్దిగా
బెల్లం తురుము: 3 టీస్పూన్లు
నిమ్మకాయలు: 2

జామకాయ ఊరగాయ తయారీ విధానం
-ముందుగా జామకాయలను శుభ్రంగా నీటితో కడిగి, తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోని గింజలను తీసేయాల్సిన అవసరం లేదు, గింజలు పచ్చడిలో పంటికి తగులుతూ రుచిగా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో సోంపు, జీలకర్ర, మెంతులు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. వాటి నుండి కమ్మని వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసి, చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి.
-మళ్లీ స్టవ్ మీద కడాయి ఉంచి, అందులో ఆవ నూనెను వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇంగువ, పసుపు వేయాలి. వెంటనే కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలను వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు జామకాయ ముక్కలలో ముందుగా మిక్సీ పట్టుకున్న వేయించిన మసాలా పొడి, కారం, నల్ల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నల్ల ఉప్పు, బెల్లం తురుము వేయాలి. అన్నీ కలిసేలా గరిటెతో తిప్పుతూ, మంటను సిమ్ లో ఉంచి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. జామకాయ ముక్కలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది.
-ముక్కలకు మసాలా, బెల్లం బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే అందులో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే తీపి-పులుపు జామకాయ ఊరగాయ రెడీ. ఈ పచ్చడిని ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకుని ఫ్రిజ్ లో పెడితే 10-15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
