For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుల్పవాటె తయారీ । గోధుమపిండితో గుల్ పవాటే చేయటం ఎలా । పిండి మరియు బెల్లం లడ్డూ తయారీ

కర్ణాటకలో చేసే ప్రత్యేక స్వీటు గుల్పవటే. దీన్ని పండగలకి, ఉత్సవాలకి అందరి ఇళ్ళలో సాంప్రదాయంగా చేసుకుంటారు. చిత్రాలు, వీడియోతో సహా రెసిపి ఇదిగో మీకోసం.

Posted By: Deepti
|
How To Make Wheat Flour Gul Pavate || గోధుమ లడ్డు తయారీ విధానం || Boldsky Telugu

కర్ణాటకలో చేసే ప్రత్యేక స్వీటు గుల్పవటే. దీన్ని పండగలకి, ఉత్సవాలకి అందరి ఇళ్ళలో సాంప్రదాయంగా చేసుకుంటారు.

గోధుమపిండిని బెల్లం పాకంలో ఉడికించి తర్వాత లడ్డూలు చేస్తే అదే గుల్పవటే స్వీటు. అదనంగా కొబ్బరి తురుము, ఏలకుల పొడి జతచేస్తే మంచి వాసన, రుచికరంగా ఉంటాయి.

ఇది చాలా సులభమైన వంటకం, చిటికెలో అయిపోతుంది. పండగలప్పుడు త్వరగా అయిపోయే వంటకాలలో ఇది ఒకటి. చేసే విధానం కూడా సులభంగా ఉండి, పెద్ద నైపుణ్యం అక్కరలేదు. సాదాగా ఉన్నా చాలా రుచికరంగా ఉండి మీ నాలుకకి స్వర్గం చూపిస్తుంది.

గుల్పవటేని చిరోటి రవ్వతో కూడా చేస్తారు. కానీ ఇక్కడ మేము గోధుమపిండిని వాడాం. మీరు ఏదన్నా పండగకి దీన్ని ప్రయత్నించాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో సహా రెసిపి ఇదిగో మీకోసం.

గుల్పవటే రెసిపి । గోధుమపిండితో గుల్పవటే తయారీ ఎలా । పిండి మరియు బెల్లం లడ్డూ రెసిపి । గుల్పవటే ఉండలు తయారీ
గుల్పవటే రెసిపి । గోధుమపిండితో గుల్పవటే తయారీ ఎలా । పిండి మరియు బెల్లం లడ్డూ రెసిపి । గుల్పవటే ఉండలు తయారీ
Prep Time
5 Mins
Cook Time
20M
Total Time
25 Mins

Recipe By: సుమ జయంత్

Recipe Type: Sweets

Serves: 15 లడ్డూలకి

Ingredients
  • నెయ్యి - 9చెంచాలు + పైన రాయడానికి

    గోధుమపిండి -1 గిన్నె

    బెల్లం - ¾ వ గిన్నె

    నీరు - 1 1/4వ కప్పులు

    తురిమిన కొబ్బరు - ½ కప్పు

    ఏలకుల పొడి - 2 ½ చెంచా

How to Prepare
  • 1. వేడిచేసిన పెనంలో 3 చెంచాల నెయ్యి వేయండి.

    2. గోధుమపిండి వేయండి.

    3. 5-7 నిమిషాలపాటు మంట మధ్యగా ఉంచి, గోధుమరంగులో మారేవరకు వేయించండి.

    4. ఒక పళ్ళెంలో తీసుకుని పక్కన పెట్టుకోండి.

    5. వేడి బాండీలో బెల్లం వేయండి.

    6. వెంటనే, మాడకుండా నీరు పోయండి.

    7. బెల్లాన్ని కరగనిచ్చి, మంట మధ్యలో ఉంచి, 5 నిమిషాలపాటు ఉడకనివ్వండి.

    8. 3 చెంచాల నెయ్యి వేయండి.

    9. అప్పుడు, వేయించిన పిండిని వేసి స్టవ్ ఆపేయండి.

    10. మిశ్రమాన్ని పిండి ముద్దలా వచ్చేలాగా బాగా కలపండి.

    11. తురిమిన కొబ్బరిని జతచేయండి.

    12. 3చెంచాల నెయ్యిని మరలా కలపండి.

    13. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.

    14. మీ అరచేతిని నేతితో జిడ్డు చేసుకోండి.

    15. మీ చేత్తో పిండిముద్దను బాగా వత్తుతూ కలపండి.

    16. అందులోంచి కొంచెం కొంచెం తీస్తూ, చిన్న చిన్న ఉండలలాగా కట్టుకోండి.

    17. పళ్ళెంలోకి మార్చి, వడ్డించండి.

Instructions
  • 1. తురిమిన కొబ్బరి బదులు చిన్న చిన్న కొబ్బరిముక్కలు కూడా వేయవచ్చు.
  • 2. లడ్డూలు కట్టేటపుడు మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉండాలి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 లడ్డూ
  • క్యాలరీలు - 296 క్యాలరీలు
  • కొవ్వు - 5.5 గ్రాములు
  • ప్రొటీన్ - 5 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 46 గ్రాములు
  • చక్కెర - 13.1 గ్రాములు
  • ఫైబర్ - 4 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - గుల్పవటే తయారీ ఎలా

1.వేడిచేసిన పెనంలో 3 చెంచాల నెయ్యి వేయండి.

2. గోధుమపిండి 1 బౌల్ వేయండి.

3. 5-7 నిమిషాలపాటు మంట మధ్యగా ఉంచండి( గోధుమరంగులో మారేవరకు వేయించండి).

4. ఒక పళ్ళెంలో తీసుకుని పక్కన పెట్టుకోండి.

5. వేడి బాండీలో బెల్లం ¾ కప్పు వేయండి.

6. వెంటనే, మాడకుండా 1 ¼ కప్పుల నీరు పోయండి.

7. బెల్లాన్ని కరగనిచ్చి, 5 నిమిషాలపాటు ఉడకనివ్వండి.( మంట మధ్యలో ఉంచండి)

8. 5 చెంచాల నెయ్యి వేయండి.

9. అప్పుడు, వేయించిన పిండిని వేసి స్టవ్ ఆపేయండి.

10. మిశ్రమాన్ని పిండి ముద్దలా వచ్చేలాగా బాగా కలపండి.

11. తురిమిన కొబ్బరిని ½ కప్పు జతచేయండి.

12. 3చెంచాల నెయ్యిని మరలా కలపండి.

13. 2 ½ చెంచాల ఏలకుల పొడిని వేయండి.

14. బాగా కలపండి.

15. మీ అరచేతిని నేతితో జిడ్డు చేసుకోండి.

16. మీ చేత్తో పిండిముద్దను బాగా వత్తుతూ కలపండి.

17. అందులోంచి కొంచెం కొంచెం తీస్తూ, చిన్న చిన్న ఉండలలాగా కట్టుకోండి

18. పళ్ళెంలోకి మార్చి, వడ్డించండి.

[ of 5 - Users]
English summary

gulpavate recipe

Gulpavate is a traditional Karnataka-style sweet recipe. Watch the video recipe. Follow the step-by-step procedure with images.
Desktop Bottom Promotion