వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సండే వచ్చిందంటే చాలామంది బ్రేక్ ఫాస్ట్ లోకి పూరీ తింటుంటాం. పూరీ చేసుకుని దానికి కాంబినేషన్ గా చికెన్ తింటుంటారు. అయితే సాధారణ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ లోకి తెలుగువాళ్లుమ తరచుగా తినే వంటకం పూరీనే. అయితే సాధారణ గోధుమపిండి పూరీలను ఆరోగ్యకరంగా మార్చుకోండి. ఇందుకోసం మునగాకుతో పూరీలను ట్రై చేయండి.

మునగాకుకి వందల రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది. అలాంటి మునగాకుతో పూరీలు చేసి తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రుచితో పాటు ఆరోగ్యం అందించే మునగాకు పూరీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy breakfast moringa poori recipe in telugu how to make drumstick leaves puri

మునగాకు పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-తాజా మున ఆకులు
-గోధుమ పిండి
-ఉప్పు
-వాము
-నీళ్లు
-నూనె

మునగాకు పూరీ తయారీ విధానం

-ముందుగా తాజా మునగాకులను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి,ఇందులోనే పచ్చిమిరపకాయలు,జీలకర్ర కూడా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అందులో గోధుమపిండి వేయండి. ఇందులోనే గ్రైండ్ చేసిన మునగాకు పేస్ట్, కొంచెం ఉప్పు, వాము వేసి పిండిని మెత్తని ముద్దలా కలుపుకోండి. అవసరమయితే కొంచెం నీటిని కలుపుకోండి. కలుపుకున్న పిండి ముద్ద మీద మూతపెట్టి కొద్దిసేపు అలాగే వదిలేయండి.

-కొద్దిసేపటి తర్వాత కలిపిన పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని చేతుల్లోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోండి. అలా పిండి మొత్తాన్ని బాల్స్ లా చేసుకోండి.

-ఇప్పుడు ఈ పిండి బాల్స్ ను తీసుకొని పూరీల్లా ఒత్తుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కాక అందులో ఒత్తుకున్న పూరీలను వేసి అవి బాగా పొంగి, లైట్ గొల్డెన్ రంగులోకి మారగానే వాటిని తీసేయండి.

-అంతే మునగాకు పూరీ రెడీ. వీటిని వెజ్ కుర్మా, వైట్ కుర్మాతో తింటే అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, October 25, 2026, 9:18 [IST]
Desktop Bottom Promotion