Latest Updates
-
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం!
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.!
వారంలో రెండు లేదా మూడు రోజులైనా తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్లో ప్రతి ఇంట్లో దోశ ఉంటుంది. ఆ తర్వాతే మిగతా టిఫిన్లు. అంతలా దోశలను ఇష్టపడతారు. మరోవైపు దోశల్లో చాలా రకాల వెరైటీలు కూడా చేసుకుంటాం. కానీ ఎన్ని వెరైటీలు ఉన్నా హెల్తీగా ఉన్న వాటికే ప్రాధాన్యత ఇస్తారు. అందులో తప్పనిసరిగా ట్రై చేయాల్సింది సగ్గుబియ్యం దోశ. ఎముకలను బలాన్ని ఇవ్వడంతో పాటు శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం మన కిచెన్లో తప్పనిసరిగా ఉంటుంది. ఈ సారి హెల్తీగా ఈ సగ్గుబియ్యం దోశను ట్రై చేయండి.

సగ్గుబియ్యం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
సగ్గు బియ్యం- అర కప్పు(125 గ్రాములు)
పెరుగు- కప్పు(250 గ్రాములు)
అల్లం- చిన్న ముక్క
పచ్చిమిర్చి- రెండు
కరివేపాకు- కొద్దిగా
బొంబాయి రవ్వ- పావు కప్పు
బియ్యం పిండి- పావు కప్పు
ఉప్పు- టీస్పూన్
నీళ్లు- కప్పు
సగ్గుబియ్యం దోశ తయారీ విధానం
సగ్గుబియ్యం దోశ తయారీ కోసం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో సగ్గుబియ్యం ఒకసారి కడిగి పోసుకోవాలి. ఇప్పుడు పెరుగును అందులో వేసి బాగా కలపాలి.
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.!
సగ్గుబియ్యం, పెరుగును బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని 8 గంటలపాటు(రాత్రంతా) నానబెట్టాలి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ టైంకి సగ్గుబియ్యం పెరుగును బాగా పీల్చుకుని పులిసిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు మిక్సీ బౌల్లో చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత బొంబాయి రవ్వ, బియ్యం పిండి వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మొత్తాన్ని సగ్గుబియ్యం, పెరుగు మిశ్రమంలో కలపాలి. రుచికి సరిపడా ఉప్పువేసి కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
ఇప్పుడు స్టవ్పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పిండి మిశ్రమాన్ని గరిటెతో పాన్పైన పోసుకోవాలి.

పాన్పైన పిండిని పరిచిన తర్వాత పై నుంచి కొద్దిగా నూనె చల్లి మూత పెట్టాలి. మీడియం మంటపైన కాల్చుకోవాలి. కాసేపటి తర్వాత మూతతీసి దోశ రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని దోశల్లా పోసుకుని కాల్చుకోవాలి. ఒక్కో దోశ స్పాంజీలా మెత్తగా, టేస్టీగా ఉంటుంది. టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది.
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.!
సగ్గుబియ్యం వంటకాలు తక్షణ శక్తిని అందించడమే కాకుండా, జీర్ణక్రియకు దోహదపడుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఎముకల బలానికి దోహదపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తమ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
