Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.!
పిల్లల నుంచి పెద్దల వరకు పర్ఫెక్ట్ న్యూట్రియంట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది కోడిగుడ్లు. ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం ద్వారా ప్రొటీన్ అందడంతో పాటు బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది. అందుకే ఎప్పుడూ బాయిల్డ్ ఎగ్స్ తినాలంటే బోర్ కొడుతుంది. ఈ సారి టేస్టీగా కొత్తగా, హెల్తీగా స్సైసీ చిల్లీ ఎగ్ ట్రై చేయండి. ఇది స్టార్టర్‌గా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఈ స్పైసీ చిల్లీ ఎగ్‌ను ఎలా చేయాలో చూద్దాం..

రెస్టారెంట్ స్టైల్ స్పైసీ చిల్లీ ఎగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు- ఆరు
ఉప్పు- టీ స్పూన్
నల్ల మిరియాల పొడి- అర టీస్పూన్
నూనె- ఐదు టీ స్పూన్లు
కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి- టీ స్పూన్
పచ్చిమిర్చి- రెండు
ఉల్లిపాయ- ఒకటి
క్యాప్సికమ్- ఒకటి
ఉప్పు- అర టీస్పూన్
మిరియాల పొడి- టీ స్పూన్
కశ్మీరీ కారం- టీ స్పూన్
శేజ్వాన్ పేస్ట్- టీ స్పూన్
సోయా సాస్- టీ స్పూన్
టమాటా కెచప్- మూడు టేబుల్ స్పూన్లు
నీళ్లు- అర కప్పు
ఉల్లికాడలు- అర కప్పు
రెస్టారెంట్ స్టైల్ స్సైసీ చిల్లీ ఎగ్ తయారీ విధానం
రెస్టారెంట్ స్టైల్ స్పైసీ చిల్లీ ఎగ్ తయారీ కోసం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో కోడిగుడ్లను పగలగొట్టి వేయాలి.
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.!
అందులో కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి విస్క్‌తో బాగా గిలక్కొట్టాలి. గిలక్కొట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో మూడు టీస్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత గిలక్కొట్టిన కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసుకోవాలి. కాసేపటి తర్వాత గరిటెతో పొరుటులా చేసుకోవాలి.

ఈ పొరుటును ప్లేటలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడయ్యాక.. కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలనుగా కట్ చేసుకుని పాన్‌లో వేసి కాసేపు వేయించాలి. అందులోనే క్యాప్సికమ్‌ను కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేయాలి.
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
కాసేపు వేయించిన తర్వాత టీస్పూన్ ఉప్పు, మిరియాల పొడి, కశ్మీరీ కారం వేసి కలపాలి. వేగిన తర్వాత శేజ్వాన్ పేస్ట్, సోయా సాస్ టోమాటో కెచప్ వేసి కలిపి ఉడికించాలి.

రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీళ్లు పోసి చిన్న మంటపైన ఉడికించుకోవాలి. కొద్దిగా ఉల్లికాడలు వేసి కలిపి మరికాసేపు వేగనివ్వాలి.
చివరిగా గుడ్డు పొరటును వేసి చిన్న మంటపైన వేయించాలి. చివరిగా మిగిలిన ఉల్లికాడలు వేసి కలిపి మిశ్రమం అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే టేస్టీ అండ్ స్పైసీ చిల్లీ ఎగ్ రెడీ. భోజనానికి ముందు స్టార్టర్‌గా లేదా.. ఈవెనింగ్ స్నాక్స్‌లాగా ఈ ఎగ్ స్నాక్స్ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
