Latest Updates
-
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు!
ఆహా.. ఏమి రుచి! సొరకాయతో చేసే ఈ నూడుల్స్ తింటే బయట ఫుడ్ మర్చిపోవడం ఖాయం!
అన్నం, కూరలు తినమంటే మారాం చేసే పిల్లలు... బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్, మ్యాగీ లాంటి జంక్ ఫుడ్ కనిపిస్తే మాత్రం ఇట్టే లాగించేస్తారు. కానీ, బయట దొరికే ఆహారం అస్సలు మంచిది కాదు. వీటి వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. పిల్లలు మ్యాగీ కావాలని పట్టుబడితే కాదనలేక, పెట్టలేక తల్లిదండ్రులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.

అయితే, ఇకపై ఆ చింత వదిలేయండి. మీ పిల్లల కోసం ఇంట్లోనే అద్భుతమైన, ఎంతో ఆరోగ్యకరమైన సొరకాయ నూడుల్స్ సులభంగా తయారు చేయవచ్చు. సొరకాయ పేరు చెబితేనే ఆమడ దూరం పరుగెత్తే పిల్లలు కూడా, ఈ నూడుల్స్ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తింటారు.
సొరకాయ నూడుల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ - 1
క్యారెట్ - 1
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్ - 1
తురిమిన అల్లం - 1 టీస్పూన్
పీనట్ బటర్ - 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ - 1 టీస్పూన్
స్వీట్ సాస్ - 1 టీస్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
చిల్లీ ఆయిల్ - 1 టీస్పూన్
వంట నూనె - 1 టీస్పూన్
కారం పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
సొరకాయ నూడుల్స్ తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి తొక్క తీసేయాలి. ఆ తర్వాత దాన్ని నూడుల్స్ లాగా సన్నని, పొడవాటి పట్టీలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్లను కూడా అదే విధంగా కోసుకోవాలి.
-కట్ చేసుకున్న సొరకాయ నూడుల్స్ లో కొద్దిగా ఉప్పు వేసి కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులోని అదనపు నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ నీటిని వంపేయాలి.
-ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పీనట్ బటర్, సోయా సాస్, స్వీట్ సాస్, వెనిగర్, చిల్లీ ఆయిల్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. అందులో తురిమిన అల్లం వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడేవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు వేసి పెద్ద మంట మీద కాసేపు వేయించాలి.
-చివరగా ముందుగా పక్కన పెట్టుకున్న సొరకాయ నూడుల్స్ వేసి, మనం సిద్ధం చేసుకున్న సాస్ మిశ్రమాన్ని పైన పోసి బాగా కలపాలి. సాస్ రుచులన్నీ నూడుల్స్‌కు బాగా పట్టేలా సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
-అంతే వేడివేడిగా, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ నూడుల్స్ రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
బయట దొరికే నూడుల్స్‌ను మైదాతో తయారు చేస్తారు, దీనిలో టేస్టింగ్ సాల్ట్ (అజినోమోటో) కలుపుతారు. ఇవి పిల్లల ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయి. కానీ సొరకాయ నూడుల్స్ పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
మైదా నూడుల్స్ వల్ల మలబద్ధకం వస్తుంది. కానీ సొరకాయలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.
అధిక బరువుతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో క్యాలరీలు తక్కువ, కొవ్వు దాదాపు సున్నా.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
