Latest Updates
-
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్‌లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే!
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.!
భారతీయ వంటకాలు ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో పొంగల్ది ప్రత్యేక స్థానం. ఆరోగ్యానికి మేలు చేస్తే మిరియాలు జోడించి ఆ ఘాటుతో పొంగల్‌ను వడ్డించి అందులో పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే వచ్చే మజా వేరు. కానీ ఎప్పుడైనా టమాటాతో పొంగల్ ట్రై చేశారా.? టమాటా బాత్‌కి మించిన రుచితో ఈ పొంగల్ జిహ్వకు ఎనలేని అనుభూతిని ఇస్తుంది. టమాటా పొంగల్ ఎలా చేయాలో చూద్దాం..

టమాటా పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
టమాటా- నాలుగు
పెసరపప్పు- అర కప్పు
బియ్యం- అర కప్పు
నల్ల మిరియాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
నీళ్లు- నాలుగు కప్పులు
జీడిపప్పులు- పది
అల్లం- చిన్న ముక్క
కరివేపాకు- కొద్దిగా
ఇంగువ- పావు టీస్పూన్
టమాటా పొంగల్ తయారీ విధానం
టమాటా పొంగల్ తయారీ కోసం ముందుగా పెసరపప్పును దోరగా వేయించి బౌల్లో తీసుకోవాలి. ఇందులో బియ్యం పోసి రెండు సార్లు కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.!
ఇప్పుడు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌పైన కుక్కర్ పెట్టుకుని అందులో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత టమాటా ప్యూరీని వేసి మగ్గనివ్వాలి. ప్యూరీ చిక్కబడి నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది.

ఈ లోపు మిరియాలు, జీలకర్రను దంచి పెట్టుకోవాలి. టమాటా ప్యూరీ మగ్గుతున్నప్పుడు టీస్పూన్ ఉప్పు, పసుపు వేసి కలపాలి.
నెయ్యి పైకి తేలిన తర్వాత అందులో బియ్యం, పెసరపప్పు మిశ్రమం వేసుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు ఉడికించి నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.!
నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేవరకు మీడియం మంటపైన ఉంచాలి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి.
ఇప్పుడు చిన్న పాన్‌ను స్టవ్‌పైన పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించాలి. కచ్చాపచ్చాగ దంచిన అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి మగ్గించాలి.
ఈ తాలింపును టమాటా పొంగల్‌లో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ టమాటా పొంగల్ రెడీ.
ఈ పొంగల్ ఈజీగా అరిగిపోతుంది. జీర్ణవ్యవస్థకి దోహదపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలకు మంచి పరిష్కారం. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications