విటమిన్ B, విటమిన్ C పుష్కలం..చలికాలంలో సాయంత్రం పూట తప్పక తాగాల్సిన సూప్ ఇదే..ఎలా చేయాలంటే..

Posted By:

శీతాకాలంలో ఏదైనా వెచ్చగా తాగాలనిపిస్తే బ్రోకలీ సూప్ ఒక అద్భుతమైన ఎంపిక. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ బి (బి6, బి9, ఫోలేట్) పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దీనిని తప్పకుండా చేర్చుకోండి. పెద్దలే కాదు, పిల్లలు కూడా క్రీమీగా ఉండే ఈ బ్రోకలీ సూప్ రుచిని ఎంతో ఇష్టపడతారు.

సాయంత్రం పూట ఏదైనా తినాలనే కోరికను తీర్చడంతో పాటు కడుపు నిండుగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఈ సూప్ తాగడం వల్ల అతిగా తినడాన్ని నివారించవచ్చు. అందువల్ల డైట్‌ లో ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే హోటల్ తరహాలో పచ్చని, క్రీమీ బ్రోకలీ సూప్‌ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthy Winter Soup Restaurant Style Creamy Broccoli Soup Recipe in Telugu

బ్రోకలీ సూప్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేయండి. నూనె వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఒక ఉల్లిపాయను వేసి తేలికగా వేయించండి. సూప్‌ ల కోసం వీటిని ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొద్దిగా నల్ల మిరియాల పొడి, 2 పెద్ద కప్పుల నీటిని పోసి బాగా కలపండి.

-కొందరు బ్రోకలీని నేరుగా నూనెలో వేస్తారు, కానీ దానివల్ల హోటల్ బ్రోకలీ సూప్ లాంటి ఆకర్షణీయమైన రంగు రాదు. కాబట్టి ముందుగా నీటిని వేడి చేయండి. నీరు బాగా మరిగిన తర్వాతే శుభ్రంగా కడిగి, సన్నగా తరిగిన బ్రోకలీని వేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి, హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టండి. సూప్ అందమైన ఆకుపచ్చ రంగులో ఉండాలంటే, ఉడికిన తర్వాత 6-7 పాలకూర ఆకులను వేసి వెంటనే మంటను ఆపివేయండి.

చలికాలంలో వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే మిల్లెట్ కూరగాయల సూప్..ఈజీగా ఇంట్లో చేసుకోండిలా..

-ఇప్పుడు వేడిగా ఉన్న బ్రోకలీ పాన్‌ ను నేరుగా ఐస్ గడ్డలు ఉన్న గిన్నెలో ఉంచి చల్లార్చండి. అలా చేయకుండా సహజంగా చల్లారనిస్తే సూప్ ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇలా చల్లార్చడం వల్ల బ్రోకలీ తాజాదనం, సహజమైన ఆకుపచ్చ రంగు చెక్కుచెదరకుండా ఉంటాయి. తర్వాత బ్రోకలీ నుండి బిర్యానీ ఆకును తీసివేసి, మొత్తం మిశ్రమాన్ని మిక్సర్‌ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి బాగా కలపండి.

-ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న సూప్‌ ను తిరిగి పాన్‌ లోకి మార్చండి. దీనికి క్రీమీ రుచిని తీసుకురావడానికి కొద్దిగా వెన్న, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపండి. మీ ఇష్టానికి అనుగుణంగా సూప్ చిక్కదనాన్ని, ఉప్పును సరిచూసుకుని అవసరమైనంత వేసుకోండి.

-అంతే ఘుమఘుమలాడే క్రీమీ బ్రోకలీ సూప్ రెడీ.

-దీనిని ఒక బౌల్‌లోకి తీసుకుని, వేడివేడిగా కొద్దిగా నిమ్మరసం కలుపుకుని లేదా అలాగే ఆస్వాదించండి.

[ of 5 - Users]
Story first published: Saturday, November 28, 2026, 13:48 [IST]
Desktop Bottom Promotion