Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
అసలు సిసలైన అమ్మమ్మల నాటి రాగి అంబలి..వేసవి తాపాన్ని ఇట్టే తరిమికొట్టే అమృతం..ఇలా చేసుకోండి!
ఎండాకాలంలో సూర్యుడి వేడి దెబ్బకి మన శరీరం అల్లాడిపోతుంది. సమ్మర్ లో శరీరాన్ని లోపలి నుండి చల్లబరిచే సాంప్రదాయ వంటకాలను ఆశ్రయించడం మన భారతీయ ఇళ్లలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన పానీయం రాగి అంబలి. ఇప్పుడు ఆరోగ్య ప్రియులందరి ఫేవరెట్ సమ్మర్ డ్రింక్ గా మారిపోయింది.
రాగి అంబలి అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఆహారం. రాగి పిండిని ఉడికించి, రాత్రంతా పులియబెట్టి, మరుసటి రోజు మజ్జిగ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి దీన్ని తయారు చేస్తారు. ఇది వేసవి వడదెబ్బ నుండి మనల్ని రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాగి అంబలిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

రాగి అంబలి తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి: 1 కప్పు
ఉల్లిపాయ: 1
పచ్చిమిరపకాయలు: 3
కొత్తిమీర తరుగు: కొద్దిగా
కరివేపాకు: 8 ఆకులు
వేయించిన జీలకర్ర పొడి: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 3 కప్పులు
మజ్జిగ లేదా చిలికిన పెరుగు: తగినంత
రాగి అంబలి తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఒక కప్పు రాగి పిండిని తీసుకుని, దానికి 2 కప్పుల నీళ్లు పోసి ఎక్కడా ఉండలు కట్టకుండా మెత్తగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో 1 నుండి 1.5 కప్పుల నీరు పోసి మరిగించాలి.
-నీరు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో నెమ్మదిగా పోస్తూ కలపాలి. అడుగు అంటకుండా, మిశ్రమం క్రీములాగా, కాస్త చిక్కబడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించి, ఆ తర్వాత స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు అసలైన సాంప్రదాయ పద్ధతి. ఒక మట్టి కుండ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి, ఈ ఉడికించిన రాగి మిశ్రమాన్ని అందులో వేయాలి. దానిపై మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని చేతితో లేదా కవ్వంతో ఉండలు లేకుండా బాగా ఎగరగొట్టాలి. దీనిలో పలుచని మజ్జిగను లేదా చిలికిన పెరుగును మీ అభిరుచికి తగినట్లుగా కలుపుకోవాలి.
-చివరగా అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. అంతే చల్లచల్లని, ఎంతో రుచికరమైన రాగి అంబలి తాగడానికి రెడీ.
రాగి అంబలితో ఆరోగ్య ప్రయోజనాలు
రాగి అంబలిని రాత్రంతా పులియబెట్టడం వల్ల అందులో గట్ (పేగుల)
ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది మీ
జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. అలాగే మజ్జిగ ఒక అద్భుతమైన
ప్రోబయోటిక్. రాగులలో క్యాల్షియం, ఫైబర్, ఫినోలిక్ సమ్మేళనాలు
పుష్కలంగా ఉంటాయి.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి రాగి అంబలి ఒక వరమనే చెప్పాలి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేసి బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కగా సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
