Latest Updates
-
రేపు ఆకాశంలో అద్భుతం: చంద్ర-శుక్ర యుతితో ఈ రాశుల వారికి రాజయోగం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - మంగళవారం, 16 జూన్ 2026 -
జెన్ జీ డేటింగ్ డిక్షనరీలో కొత్త పదం పఫర్ ఫిషింగ్.. మీ లవ్ స్టోరీలోనూ ఇలాగే జరుగుతోందా? -
భర్త మరణం, చేతిలో పసికందు,చేతిలో ఉన్నది రూ.500..ఇప్పుడు ఆమె టర్నోవర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! -
గర్భిణీలు నేరేడు పండ్లు తింటే పిల్లలు నల్లగా పుడతారా.. ఇందులో నిజమెంత.? -
హనుమాన్ అష్టోత్తరం అర్థం తెలిస్తే జీవితం మారుతుంది -
గుడ్డు తింటున్నారా? ఈ పచ్చి నిజాలు మీరు తెలుపుకోవాల్సిందే! -
మ్యాంగో గులాబ్ జామ్ తిన్నారా? సమ్మర్ అయిపోయే లోపు తప్పకుండా తిన్సాల్సిన స్వీట్! -
భార్యపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందా.?.. మీరు అస్సలు ఊహించని షాకింగ్ నిజాలు ఇవే.! -
ఆధునిక జంటలు నార్మల్ అనుకుంటున్న అతి పెద్ద రిలేషన్ షిప్ తప్పు ఇదే.. మీరూ చేస్తున్నారా?
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్!
వేడి వేడి పూరీలోకి ఆలూ కూర, సాయంత్రం స్నాక్స్ గా ఆలూ బజ్జీ లేదా ఆలూ పరాటా, పానీపూరిలో మసాలా, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్ విచ్.. ఇలా చెప్పుకుంటూ పోతే బంగాళదుంపతో చేసే వంటకాల జాబితాకు అంతు ఉండదు. సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండటం, ఏ కూరగాయతోనైనా సులభంగా కలిసిపోవడం, అందరికీ ఇష్టమైనది కావడం వల్ల ఇది మన ఇళ్లలో రోజువారీ ఆహారంలో ఒక ప్రధాన భాగమైపోయింది.

అయితే బంగాళదుంపలను వండే క్రమంలో చాలామంది ఇల్లాళ్లు ఎదుర్కొనే మొదటి సవాలు... వాటిని సరిగ్గా ఉడకబెట్టడం. చాలాసార్లు బంగాళదుంపలు లోపల సరిగ్గా ఉడకవు, లేదా మరీ మెత్తగా పేస్ట్ లా మారిపోయి కూర ఆకారాన్ని పాడుచేస్తాయి. పొట్టు తీయడం కూడా కొన్నిసార్లు పెద్ద ప్రహసనంగా మారుతుంది. అయితే వంట నిపుణులు సూచిస్తున్న సులభమైన చిట్కాలను పాటిస్తే, మీ ఆలూ వంటకాల రుచి అమాంతం పెరిగిపోతుంది.
నీటిలో కొద్దిగా ఉప్పు వేయడం
బంగాళదుంపలను ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేయడం అనేది
ఎప్పటినుండో ఉన్న అత్యంత సులభమైన ట్రిక్. ఉప్పు బంగాళదుంపల లోపలి వరకు
వెళ్లి, దానికి చక్కని రుచిని ఇస్తుంది. చప్పగా ఉండే ఆలూకు ఇది ప్రాణం
పోస్తుంది. అలాగే ఉప్పు నీటిలో ఉడకడం వల్ల బంగాళదుంపల తొక్క చాలా
సులభంగా ఊడివస్తుంది. ఆలూ చాట్, ఫ్రై, కూరలు చేసేటప్పుడు ఈ పద్ధతి
బాగా పనిచేస్తుంది.
ప్రెషర్ కుక్కర్ లో నూనె చుక్కలు
కుక్కర్ లో బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ నూనె
వేసి చూడండి. ఈ నూనె ఉడుకుతున్న బంగాళదుంపల చుట్టూ ఒక సన్నని పొరలా
ఏర్పడుతుంది. దీనివల్ల పొట్టు ఈజీగా రావడమే కాకుండా, బంగాళదుంపలు మరీ
మెత్తగా చితికిపోకుండా, విడిపోకుండా ఉంటాయి. కట్లెట్లు, ఆలూ టిక్కీలు,
సలాడ్స్ వంటి ఆకారం దెబ్బతినకూడని వంటకాలకు ఈ చిట్కా బ్రహ్మాస్త్రంలా
ఉపయోగపడుతుంది.

నిమ్మరసం అద్భుతం
మరుగుతున్న నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం పిండి ఉడకబెట్టడం అనేది మరో
అద్భుతమైన పద్ధతి. నిమ్మరసంలోని స్వల్ప ఆమ్లత్వం బంగాళదుంపల రుచిని
పెంచడమే కాకుండా, ఉడికిన తర్వాత అవి రంగు మారి నల్లబడకుండా
కాపాడుతుంది. ఫ్రెష్ సలాడ్స్ తయారు చేసుకునేవారికి ఇది బెస్ట్
ఆప్షన్.
బిర్యానీ ఆకులతో సువాసన
బంగాళదుంపలకు మంచి సువాసన రావాలంటే ఉడకబెట్టే నీటిలో ఒకటి లేదా రెండు
బిర్యానీ ఆకులను వేయండి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రహస్యం.
ఆకులు విడుదల చేసే సుగంధ పరిమళాలు బంగాళదుంపలకు పట్టి, వాటికి ఒక రిచ్
ఫ్లేవర్ ను అందిస్తాయి. పులావ్, మసాలా కూరలు వండేటప్పుడు
ఇలా చేస్తే వంటకం రుచి రెట్టింపు అవుతుంది.
వెనిగర్ తో సరైన ఆకృతి
బంగాళదుంపల ఆకారం ఏమాత్రం చెదరకుండా ఉండాలంటే నీటిలో కొద్దిగా వెనిగర్
కలపడం బెస్ట్ ఐడియా. వెనిగర్ బంగాళదుంప పై పొరను గట్టిగా ఉంచుతుంది,
తద్వారా లోపల ఉడికినా బయట చితికిపోదు. ఫ్రెంచ్ ఫ్రైస్, రెస్టారెంట్
స్టైల్ పొటాటో సలాడ్స్ చేసే వారు కచ్చితంగా పాటించవలసిన చిట్కా
ఇది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications