Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
chicken pickle: చికెన్ పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది
నాన్ వెజ్ అంటే చాలామందికి ఫస్ట్ గుర్తుకొచ్చేది చికెన్. నాన్ వెజ్ పచ్చళ్లల్లో చికెన్ పికెల్(Chicken pickle) ఫ్లేస్ టాప్ లో ఉంటుంది. నాన్ వెజ్ పచ్చళ్లల్లో దేని టేస్ట్ దానిదే అయినప్పటికీ చికెన్ టేస్ట్ మాత్రం వేరే లెవల్. చికెన్ పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. 1 కేజీ చికెన్ తో పచ్చడిని సింపుల్ గా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ లెస్ చికెన్ 1 కేజీ
-పసుపు
-ధనియాలు
-దాల్చిన చెక్క
-యాలకులు
-లవంగాలు
-ఉప్పు
-నూనె
-ఆవాలు
-మెంతులు
-జీలకర్ర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-నిమ్మరసం

చికెన్ పచ్చడి తయారీ విధానం
-ముందుగా చికెన్ ని నీట్ గా కడుక్కున్న తర్వాత చికెన్ ను మీడియం సైజ్
లో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఈ చికెన్ ముక్కలను మందంగా ఉండే ఓ కడాయిలో వేసి అందులో ఒక అర టీస్పూన్
పసుపు,ఒక టీస్పూన్ ఉప్పు,1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చికెన్ ముక్కలకు
బాగా మసాజ్ చేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఆ కడాయిని పెట్టి మూత పెట్టుకోండి. మంటను మీడియం
ఫ్లేమ్ లో ఉంచండి. 10 నుంచి 15 నిమిషాలు ముక్కలను ఉడకనివ్వాలి. అయితే
మధ్యమధ్యలో మూత తీసి ముక్కలను కలుపుతూ ఉండండి.
-చికెన్ ఉడికేలోగా ఈ చికెన్ పచ్చడి కోసం కావాల్సిన మసాలా రెడీ
చేసుకోవాలి. అందుకోసం మరో బాండీ స్టవ్ మీద పెట్టి అందులో రెండు ఇంచుల
దాల్చిన చెక్క,3 యాలకులు,6 లవంగాలు వేసి కొద్దిగా ఫ్రై చేయండి.
-కొద్ది సేపు తక్కువ మంట మీద వాటిని వేయించుకున్న తర్వాత అందులో 2
టేబుల్ స్పూన్ ల ధనియాలు వేయండి. ధనియాలు కూడా కొద్దిగా వేగాక అందులో
1 టేబుల్ స్పూన్ ఆవాలు,అర టేబుల్ స్పూన్ మెంతులు,అర టేబుల్ స్పూన్
జీలకర్ర వేయండి.
-2 నిమిషాల పాటు వీటిని లో ప్లేమ్ మీద వేయించుకున్న తర్వాత ఆ బాండీ
మొత్తాన్ని తీసి పక్కన పెట్టండి.కంప్లీట్ గా చల్లారిన తర్వాత అది
మొత్తం మిక్సీలో వేయండి. మిక్సీలో వేయగా వచ్చే పొడిని ఓ ప్లేట్ లో
తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే మరో ప్యాన్ పెట్టి అందులో 250 గ్రాముల
నువ్వుల నూనె పోయండి.సన్ ప్లవర్ ఆయిల్ మాత్రం వేయవద్దు. కావాలంటే
పల్లీ నూనె వేసుకోవచ్చు.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న
చికెన్ ముక్కలను వేయండి. మంటలను మీడియం ప్లేమ్ లో పెట్టి మాత్రమే ఈ
చికెన్ ముక్కలను వేయించుకోండి.
-చికెన్ ముక్కలు లైట్ గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో
దంచిపెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని
వేయండి. ఒక ఐదు నిమిషాలు లో ప్లేమ్ లో వేయించుకొని స్టవ్ ఆపేసి ప్యాన్
ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అది వేడిగా ఉండగానే మిక్సీలో వేసి చేసిన పొడిని,40 గ్రాముల
ఉప్పు,60 గ్రాముల కారం ఆ చికెన్ ముక్కలలో వేసి బాగా మిక్స్ అయ్యేట్లు
కలపి పూర్తిగా చల్లారనివ్వాలి.
-పూర్తిగా చల్లారిన తర్వాత అందులో 4 మీడియం సైజ్ నిమ్మకాయల రసం పోసి
కలిపి తర్వాత దాన్ని ఓ గాజు బౌల్ లోకి తీసుకోవాలి. 2 రోజుల పాటు అలాగే
ఉంచితే ఫర్ఫెక్ట్ చికెన్ పచ్చడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications