Latest Updates
-
భారతదేశంలో అత్యంత శీతల ప్రాంతం ఏదో తెలుసా? మైనస్ 45 డిగ్రీల చలిలోనూ జనజీవనం! -
మిగిలిపోయిన అన్నంతో కర్ణాటక స్పెషల్ కూర్గీ రోటీ.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు -
భారతదేశపు అత్యంత పురాతన స్వీట్ ఇదే! -
తెల్లగా మెరిసే పళ్లు ఆరోగ్యానికి సంకేతమా? పళ్ళ రంగు గురించి మీకు తెలియని నిజాలివే! -
విటమిన్ B, విటమిన్ C పుష్కలం..చలికాలంలో సాయంత్రం పూట తప్పక తాగాల్సిన సూప్ ఇదే..ఎలా చేయాలంటే.. -
షుగర్ పేషెంట్లు తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే..ఎంత మోతాదులో తినాలంటే.. -
చలికాలంలో అందరూ తప్పక తినాల్సిన లడ్డు ఇదే..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
హార్మోన్ల సమతుల్యత నుండి ఎముకల బలం వరకు.. ప్రతి మహిళ తినాల్సిన 5 ఆరోగ్యకరమైన ఆహారాలు! -
ఎగ్ కీమా మసాలా ఇలా చేస్తే.. 2 చపాతీలు ఎక్కువే తింటారు! -
ఆరు కోట్ల బిజినెస్, రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం భర్తకు ఫుడ్ లో విషం.. కన్నకొడుకునూ వదలని కిరాతక తల్లి!
అన్నం, చపాతీ, దోసెల్లోకి అద్భుతమైన రుచినిచ్చే గుడ్డు కొబ్బరి కూర..ఈజీగా చేసుకోండిలా..
కోడిగుడ్లతో రోజూ ఒకేలా ఆమ్లెట్, ఫ్రై లేదా ఉడికించిన గుడ్లు తిని విసుగు చెందారా? సాధారణ గుడ్డు కూరలకు భిన్నంగా గుడ్డు కొబ్బరి గ్రేవీ ఓసారి చేసి చూడండి.. రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నం, చపాతీ, పూరీ, దోసె.. దేనితో తిన్నా దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే. వంట కొత్తగా నేర్చుకునే వారు కూడా దీన్ని ఎంతో సులభంగా తయారు చేయవచ్చు.
కావలసిన పదార్థాలు
గుడ్లు- 4
బంగాళదుంప- 1
కొబ్బరి- అర కాయ
పెద్ద ఉల్లిపాయలు- ఒకటిన్నర
గసగసాలు- అర టీస్పూన్
అల్లం- అర అంగుళం
వెల్లుల్లి- 2 రెబ్బలు
చింతపండు- ఒకటిన్నర టీస్పూన్
కాశ్మీరీ కారం- పావు టీస్పూన్
కారం- ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి- 1 టీస్పూన్
జీలకర్ర పొడి- పావు టీస్పూన్
మిరియాల పొడి- పావు టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
గరం మసాలా- పావు టీస్పూన్
నూనె- 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు- కొద్దిగా
కొత్తిమీర- 1 కట్ట
ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా గుడ్లను కడిగి, గిన్నెలో నీరు, ఉప్పు, కొన్ని చుక్కల నూనె వేసి 8 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత చల్లటి నీటిలో వేయకుండా సహజంగా చల్లారనిచ్చి, పెంకు తీసి కత్తితో నిలువుగా గాట్లు పెట్టండి.
-బంగాళదుంపను తొక్క తీసి ముక్కలుగా కోసి నీటిలో ఉంచండి. ఒక ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా, మరో అర ఉల్లిపాయను సన్నగా తరగండి. అల్లం, వెల్లుల్లి శుభ్రం చేసి, చింతపండులోని పీచు తొలగించి కడిగి పక్కన పెట్టండి.
-బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు వేసి పారదర్శకంగా మారే వరకు వేయించండి. తర్వాత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చింతపండు వేసి కొబ్బరి బంగారు రంగులోకి వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత కాశ్మీరీ కారం, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆపేయండి. ఇవి చల్లారాక మిక్సీ జార్ లో వేసి ఉప్పు, తగినంత నీరు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోండి.
విటమిన్ B, విటమిన్ C పుష్కలం..చలికాలంలో సాయంత్రం పూట తప్పక తాగాల్సిన సూప్ ఇదే..ఎలా చేయాలంటే..
-అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, కరివేపాకు, సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి కాసేపు వేయించాక, రుబ్బిన మసాలా పేస్ట్ వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు కలపండి.
-గ్రేవీకి సరిపడా నీరు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయి బంగాళదుంపలు మెత్తగా ఉడికే వరకు మరిగించండి. చివరగా గాట్లు పెట్టిన గుడ్లు వేసి కొన్ని నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లితే సరి.
-అంతే, ఘుమఘుమలాడే గుడ్డు కొబ్బరి కూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
