Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
బొంబాయి రవ్వతో ఇంట్లోనే హెల్తీ శాండ్విచ్.. బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్.!
రెగ్యులర్ శాండ్విచ్ తిని బోర్ కొట్టేసిందా.. అయితే బొంబాయి రవ్వతో ఈ సారి కొత్తగా ట్రై చేయండి. సన్న రవ్వని తినడానికి ఇష్టపడని వారు సైతం ఆవురావుమంటూ లాగించేస్తారు. ముఖ్యంగా రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌లు, స్నాక్స్‌లతో విసిగిపోయిన వారికి ఈ బొంబాయి రవ్వ శాండివిచ్ హెల్తీ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సూజీ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ- ఒక కప్పు
పెరుగు- ఒక కప్పు
ఉప్పు- తగినంత
కారం- ఒక టీ స్పూన్
ఉల్లిపాయ- ఒకటి
టమాటా- ఒకటి
క్యాప్సికమ్- ఒకటి
టొమాటో కెచప్
వెన్న
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు, కారం ఉండలు లేకుండా కలియతిప్పాలి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్ ముక్కలను వేసి మొత్తం మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కావాలనుకుంటే కొద్దిగా ఈనో, నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టుకుని వేడయ్యాక కొద్దిగా నూనె రాయాలి. బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటిపై ఒకవైపు టొమాటో కెచప్ అప్లై చేసుకోవాలి. తయారుచేసుకున్న సూజీ మిశ్రమాన్ని దానిపైన సమంగా పరచాలి. అనంతరం పెనంపై వేడి చేసుకోవాలి. బ్రెడ్ ముక్కకి మరోవైపు వెన్న రాసి రెండువైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలకి ఇలాగే పేస్ట్ అప్లై చేసి కాల్చడమే.. అంతే పది నిమిషాల్లో రుచికరమైన సూజీ శాండ్విచ్ రెడీ..
-టిఫిన్ చేయడానికి టైం లేనప్పుడు ఈ సూజీ శాండ్విచ్ ఇన్స్టంట్ హెల్తీ టిఫిన్. ఇక సాయంత్రం స్నాక్స్ టైంలో లేదా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా.. హడావుడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ లేదా టొమాటో సాస్‌తో తింటే ఆ రుచి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
