సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా..

Posted By:

మీల్ మేకర్ లేదా సోయా..నాన్ వెజ్ తినని వాళ్లకు బెస్ట్ వెజ్ ఫుడ్. ప్రొటీన్ పుష్కలంగా ఉండి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందించే శక్తి సోయాకి ఉంది. అయితే సోయాను పులావ్ తయారీకి లేదా కర్రీలు చేసుకోడానికి వాడుతుంటాం. సోయాతో అనేక రకాల వెరైటీ వంటకాలు తయారుచేస్తుంటారు.

అయితే మీరెప్పుడైనా సోయా పుట్టు తిన్నారా? అన్నంలో కలుపుకుంటే సమ్మగా ఉంటుంది. ఇన్ని రోజులు ఇదెలా మిస్ అయ్యాం అనుకోక తప్పదు. చేయడం కూడా చాలా చాలా ఈజీ. మీ ఇంట్లోనే ఈజీగా సోయా పుట్టు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

How to make healthy tasty soya puttu recipe in telugu quick and unique meal maker dish

కావాల్సిన పదార్థాలు

-40 గ్రాముల మీల్ మేకర్
-వేడి నీళ్లు(మీల్ మేకర్ నానబెట్టేందుకు)
-8 చిన్న ఉల్లిపాయలు
-3 వెల్లుల్లి రెబ్బలు
-1 పచ్చి మిరపకాయ
-2 టేబుల్ స్పూన్ల కొబ్బరి
-అర టీస్పూన్ సోంపు
-అర టీస్పూన్ కశ్మీరీ కారం పొడి
-అర టీస్పూన్ గరం మసాలా
-ఉప్పు
-పసుపు
-అర టేబుల్ స్పూన్ నూనె
-కరివేపాకు

దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా మీల్ మేకర్(సోయా)ను వేడి నీళ్లల్లో కొద్దిసేపు నానబెట్టండి. అవి నానిన తర్వాత వాటిని చేతుల్లోకి తీసుకుని నీరు లేకుండా పిండుకోండి. తర్వాత మిక్సీ జార్ లో వాటిని వేసి గ్రైండ్ చేసుకోండి. ఒక పొట్టు మాదిరిగా ఉండాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమం వేసి, చిటికెడు పసుపు, కరివేపాకు వేసి కలిపి 2 నిమిషాలు వేయించాలి.

-ఈలోపు మిక్సీ జార్ లో 8 చిన్న ఉల్లిపాయలు, 1 పచ్చి మిరపకాయ, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, అర టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ కశ్మీరీ కారం పొడి, అర టీస్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసి మొత్తాన్ని బరక పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

-గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో స్టవ్ మీద పాన్ లో ఉన్న మీల్ మేకర్ మిశ్రమంలో వేసి మీడియం మంట మీద కలుపుతూ 5 నిమిషాలు వేయించాలి. పచ్చివాసన పోయి, పుట్టు పొడిగా మారి, మంచి వాసన వచ్చేవరకు వేగాక స్టవ్ ఆపేయండి.

-అంతే సోయా పుట్టు రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, October 30, 2026, 19:16 [IST]
Desktop Bottom Promotion