Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
లంచ్ బాక్స్‌లోకి చిటికెలో చేసుకునేలా.. వెల్లుల్లి ఘాటుతో ఎగ్ మసాలా రైస్.!
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వంట ఏం చేయాలో అర్థం కాదు. అప్పటికప్పుడు బయటకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇంట్లో ఉల్లిపాయ, టమాటా, కోడిగుడ్లు ఉంటే చాలు చిటికెలో ఘాటుఘాటుగా రుచికరమైన ఇన్స్టంట్, హెల్తీ డిష్‌ను ఆస్వాదించవచ్చు. అదే స్పైసీ గార్లిక్ ఎగ్ మసాలా రైస్. సాధారణంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా మందికి తెలిసిందే. ఎగ్స్, క్యాబేజీ ముక్కలు, క్యాప్సికమ్ ఇలా ఫాస్ట్‌ఫుడ్ స్టైల్లో చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇలా రెగ్యులర్ స్టైల్లో కాకుండా ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడమే కాదు.. లంచ్బాక్సుల్లోకి సైతం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.

స్పైసీ గార్లిక్ ఎగ్ మసాలా రైస్‌కి కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయ- ఒకటి
టమాటా- మూడు
వెల్లుల్లి రెబ్బలు- 4
ఉప్పు- సరిపడా
కారం- టీస్పూన్
ధనియాల పొడి- టీ స్పూన్
మిరియాల పొడి- ఒక టీ స్పూన్
గరం మసాలా- ఒక టీస్పూన్
గుడ్లు- మూడు
ఉడికించి అన్నం
వంట నూనె- మూడు టీ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టొమాటోలను రెండు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్రీ పాన్‌లో నూనె పోసి వేడయ్యాక టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి టొమాటో ముక్కలపై తొక్క తీసేయాలి. మాషర్‌తో మెత్తగా చేసుకోవాలి.
-తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత గుడ్లు పగలగొట్టి వేయాలి. గరిటెతో మొత్తం కలియతిప్పి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి బియ్యంతో ఉడికించిన అన్నాన్ని తీసుకుని పాన్‌లో వేసి కలపాలి. మూత పెట్టి ఓ రెండు నిమిషాలు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కనపెట్టాలి. అంతే రుచికరమైన స్పైసీ ఎగ్ గార్లిక్ మసాలా రైస్ రెడీ..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
